News
News
X

KCR In Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.1000 కోట్లయినా ఇస్తాం, సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలివే

కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

FOLLOW US: 
Share:

కొండగట్టు అంజన్న ఆలయంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముఖ్యంశాలు
భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

కొండగట్టు అంజన్న స్థల పురాణం వివరించిన సీఎం కేసీఆర్
అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయత, అభయారణ్యంతో కూడిన కొండగటట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు. కొండగట్టు అంజన్న ఆలయానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి పైపుల ద్వారా నీటిని తరలించే పనులను చేపట్టాలని, కార్యదర్శి  స్మితా సబర్వాల్, ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉన్నందున తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కొండగట్టు ఆలయంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముఖ్యంశాలు
-  దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాల పై లొకేషన్ మ్యాపుతో పూర్తిగా పరిశీలించిన సీఎం కేసీఆర్
-  ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు.
-  వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టనున్నట్లు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.
-  నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధం
-  యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపతడతామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.  
-  ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మూలవిరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ సాగాలన్నారు. 
-  వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో నిర్ణయించుకోవాలన్నారు.  ఏటా లక్షలాది మంది దీక్షాపరులు దీక్ష చేపడతారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలన్న సీఎం.
-  మంగళవారం, శని, ఆదివారాల్లో రద్దీ సమయాలతో పాటు, హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడీని తట్టుకునేలా నిర్మాణం  చేపట్టాలని సూచించిన సీఎం.
-  ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి  అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
-  క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని సూచన
-  హనుమాన్ జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి
-  కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలని ఆదేశాలు
-  విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం,  పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని స్పష్టం చేసిన సీఎం
-  ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సూచించిన సీఎం కేసీఆర్
-  ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులకు తెలిపిన సీఎం
-  గుట్టల పై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం సంతులోని లొద్దిలో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి సీఎం చర్చించారు. 
-  గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారులతో సీఎం ఆరా తీశారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని సీఎంకు వివరించిన అధికారులు  
-  గుట్ట మీద కాటేజీల నిర్మాణికి దాతలను ఆహ్వానించాలన్న సీఎం. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ వారు నిర్మించి కాటేజ్ విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మాస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అందుకు సీఎం గంగుల కమలాకర్ ను అభినందించారు. 
-  కళ్యాణ కట్ట దగ్గర పుష్కరిణిలు ఏర్పాటు చేయాలన్నారు. కళ్యాణ కట్ట పుష్కరిణి పక్కపక్కన ఉండటంతో పాటు స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుష్కరిణులు ఏర్పాటు చేయాలన్నారు.
-  కొండగట్టు అంజన్న అబయారణ్యం ప్రాంతం మైసూరు -  ఊటి రహదారిలోని  నీలగిరి కొండల్లోని బందీపూర్ అభయారణ్యం మాదిరి మార్చాలని అటవీశాఖ అధికారి భూపాల్ రెడ్డికి సీఎం సూచించారు. 
-  స్థల పురాణం పుస్తకాలను ముద్రించాలని, రాస్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు ఉండేలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. 
-  ఆధ్యాత్మిక పర్యాటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖ ఎండి మనోహర్ రావును సీఎం ఆదేశించారు. 
-  ఆలయానికి వచ్చిన భక్తుల దర్శన విధానాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అదే పద్ధతిలో పునర్నిర్మాణాలను చేపట్టాలన్నారు
-  మొదటి మూలవిరాట్టును దర్శించుకన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకల దర్శనం సర్క్యూట్ ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
-  గుట్ట మీదకి వచ్చే వివిఐపి లకోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్ సూట్ , వివిఐపి సూట్ల నిర్మణానాకి సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తుల నియమాలను అనుసరించి  నిర్మాణాలు చేపట్టాలన్నారు.
-  రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సప్లై జరిగేలా మిషన్ భగీరథ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని తరలించే పనులను తక్షణమే పనులు చేపట్టాలని సీఎం స్మితా సభర్వాల్, , ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలైతాయన్నారు. 
-  అంజనాద్రి పేరుతో వేదపాఠశాలను నిర్మించాలనీ, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. 
-  రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు  చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను అనేక పర్యటనలు చేపట్టాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమాలకర్, ఎంపి దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ రావు, ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, డిసిసిబి ఛైర్మన్ అల్లోల శ్రీకాంత్ రెడ్డి , గెల్లు శ్రీనివాస్ యాదవ్,  సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, ఆర్ అండ్ బి అధికారులు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి ఆనందర్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

Published at : 15 Feb 2023 04:38 PM (IST) Tags: Jagityala KCR Kondagattu Temple Kondagattu Anjanna Temple Kondagattu Master Plan

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Political  Panchamgam :  ఏ పార్టీ పంచాంగం వారిదే -  రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?