News
News
X

Peddapalli: ఆ సినిమా చూసి శవం ముక్కలు చేసి.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో.. వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని ఖాజీపల్లికి చెందిన మీ-సేవ ఆపరేటర్‌ శంకర్‌ శనివారం దారుణహత్యకు గురయ్యారు.

FOLLOW US: 
Share:

పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుడిని విచారణ జరపగా పోలీసులు అసలు విషయాలను రాబట్టారు. కొద్ది రోజుల క్రితం ఓటీటీలో రిలీజైన ‘కోల్డ్‌ కేస్‌’ అనే మలయాళీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా చూసి అలాగే హత్యకు ప్లాన్‌ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో యువకుడిని హతమార్చి, ఒకచోట తల, మరోచోట ఇతర శరీర భాగాలు పడేసినట్లుగా తేల్చారు.

కేసు ఏంటంటే..
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని ఖాజీపల్లికి చెందిన మీ-సేవ ఆపరేటర్‌ శంకర్‌ శనివారం దారుణహత్యకు గురయ్యారు. అతడి మృత దేహాన్ని ముక్కలు చేసి గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, ఎన్టీపీసీ, బసంత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పారవేశాడు. మృతుడి తల, చెయ్యి రాజీవ్‌ రహదారి సమీపంలోని మల్యాలపల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్ల పొదల్లో దొరికాయి. ఈ క్రమంలోనే అనుమానితుడైన రాజు ఉండే క్వార్టర్‌ను పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులను క్వార్టర్‌ ప్రాంగణంలోనే నిందితుడు కాల్చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

అయితే, ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. రామగుండం కమిషనరేట్‌ పోలీసులు కొందరు ఇచ్చిన సమాచారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో తానెలా హత్య చేసిందీ, శరీర భాగాలను ఎక్కడెక్కడ విసిరేసిందీ నిందితుడు మొత్తం చెప్పేసినట్లుగా తెలుస్తోంది. 

‘కోల్డ్‌కేస్‌’ సినిమా చూసి హత్య
‘కోల్డ్‌కేస్‌’ సినిమాలోని లాయర్‌ క్యారెక్టర్ తన క్లయింట్‌కు భరణం కింద వచ్చిన డబ్బును కాజేయాలనే అత్యాశతో ఆ క్లయింట్‌ను హత్యచేసి శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేస్తాడు. పాలిథిన్‌ కవర్లలో చుట్టి కేరళ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో విసిరేస్తుంది. వేర్వేరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో శరీర భాగాలు దొరకడంతో అన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ కేసు మిస్టరీగానే ఉంటుంది. ఈ సినిమా చూసి శంకర్‌ హత్యకు ప్రణాళిక వేసినట్లుగా విచారణలో బయటపడింది.

హత్య వెనుక రాజు, శంకర్‌ భార్య, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే, తాను ఒక్కడినే ఈ పనిచేసినట్లుగా రాజు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధంతో పాటు కొన్ని అభ్యంతరకర ఫొటోలను రాజు వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో గొడవ జరిగిందని, అందుకే శంకర్‌ హత్యకు గురైనట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!

Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Nov 2021 11:37 AM (IST) Tags: peddapalli murder Ramagundam Police Mee seva man death Cold case movie Mee seva man murder case

సంబంధిత కథనాలు

TS News Developments Today: కేటీఆర్‌ నిజామాబాద్ పర్యటన, వరంగల్‌లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!

TS News Developments Today: కేటీఆర్‌ నిజామాబాద్ పర్యటన, వరంగల్‌లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే

అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్ట్‌లు- బాంబు పేల్చిన ఈటల రాజేందర్

అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్ట్‌లు- బాంబు పేల్చిన ఈటల రాజేందర్

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!