Venkateswara Temple: తిరుమల టెంపుల్ లాగే కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం - మంత్రి గంగుల
ఈ నెల 31వ తేదీన కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసినప్పటికీ... ఈ నెల 22వ తేదీ సోమవారం భూకర్షణం కార్యక్రమంతో ఆలయ నిర్మాణపనులకు అంకురార్పణ చేయనున్నారు.
- ఈ సోమవారం భూకర్షణంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేస్తాం
- ఈ 31వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తాం
- అదే రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
- రాజకీయాలకు అతీతంగా అందరూ నాయకులను ఆహ్వానిస్తున్నాం...
- బండి సంజయ్... పొన్నం ప్రభాకర్ లను కూడా ఆహ్వానిస్తున్నాం
- ఆలయం మొత్తం రాతి కట్టడం, తమిళనాడు నుంచి రాయి
కరీంనగర్ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల అంకుర్పాణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసినప్పటికీ... ఈ నెల 22వ తేదీ సోమవారం భూకర్షణం కార్యక్రమంతో ఆలయ నిర్మాణపనులకు అంకురార్పణ చేయనున్నారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం పై టిటిడి క్షేత్ర ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు. ఇతర టిటిడి అధికారులతో కరీంనగర్ లో సమావేశమైన బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ శ్రీవారి ఆలయాన్ని సంవత్సరంన్నరలోగా గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి గంగుల.
ఈ సోమవారం భూకర్షణం కార్యక్రమంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేస్తామని... ఈ నెల 31వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి... అదే రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనన్న మంత్రి గంగుల.... ఈ పవిత్ర కార్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమమని... ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని... పార్టీలకతీతంగా తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆలయం మొత్తం రాతి కట్టడంతో ఉంటుందని... ఈ రాయిని తమిళనాడు నుంచి తీసుకువస్తామన్నారు.
కలియుగంలో భక్తులను రక్షించేందుకే తిరుమలలో శ్రీవారు వెలిశారు
ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ కలియుగంలో భక్తులను రక్షించేందుకే శ్రీవారు తిరుమలలో వెలిశారన్నారు.. స్వామి వారి అనుగ్రహం ఉండటం వల్లే కరీంనగర్ లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయన్నారు. ఆలయ నిర్మాణ పనులకు 31వ తేదీన శంకుస్థాపన చేయనున్నప్పటికీ... వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం... ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం మిథున లగ్నంలో భూకర్షణం చేసిన పనులకు అంకురార్పణ చేయనున్నామన్నారు. 31 వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమై 7 గంటల 20 నిమిషాలకు ముగుస్తుందన్నారు. అదే రోజున సాయంత్రం ఆలయ నిర్మాణ ప్రాంగణం లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నామన్నారు.
తిరుమల తిరుపతి క్షేత్రంలో స్వామి వారికి ఎలాంటి కైంకర్యాలైతే చేపడుతారో.... అలాంటి సేవలను కరీంనగర్ శ్రీవారి ఆలయం (Venkateswara Temple In Karimnagar Like Tirumala)లో చేపట్టనున్నామన్నారు..ఈ కార్యక్రమంలోనగర మేయర్ యాదగిరి సునీల్ రావు,బారాసా నగర అధ్యక్షులు చల్లాహరిశంకర్ టిటీడీ ఆలయ ప్రధాన అర్చకులువేణుగోపాల దీక్షితులు... ఆగమశాస్త్ర నిపుణులు మోహనరంగా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.