India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
ఆస్ట్రేలియా ఇండియా మధ్య టీ20 సిరీస్ మొదలు కానుంది. వున్డేలో లో పూర్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ను నిరాశ పరచిన టీమ్ ఇండియా ఈ సారి ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఆసియా కప్ సొంతం చేసుకున్న తర్వాత ఇండియా ఆడబోయే తోలి టీ20 సిరీస్ ఇదే.
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ జరుగుతుండడంతో ఈ సిరీస్ టీమ్ ఇండియాతో పాటు ప్లేయర్స్ కు కూడా చాలా ముఖ్యం. ఇక ఆస్ట్రేలియా కూడా టీ20 ఫార్మాట్ లో మంచి ఫార్మ్ కొనసాగిస్తుంది. దాంతో ఇప్పుడు అందరు టీమ్ ఇండియా ప్లేయింగ్-11 గురించి మాట్లాడుకుంటున్నారు.
బ్యాటింగ్ విషయానికి వస్తే... ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గత ఇన్నింగ్స్ లో అంత ప్రభావం చూపలేక పొయ్యాడు. ఇలా ఇంగ్లాండ్ పర్యటన నుంచి కొనసాగుతుంది. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉంది. ఆలా అయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనేఇంగ్ చేయొచ్చు.
అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో నితీష్ కుమార్ ను మళ్ళి టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే నితీష్, రింకూ సింగ్ మధ్య ఎవరినో ఒకరికి తీసుకునే ఛాన్స్ ఉంది. స్పిన్ విషయానికి వస్తే.. అక్షర్ పటేల్ ఆడటం ఖాయం. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో... ఎవరో ఇద్దరిని మాత్రమే తీసుకుంటారు. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక మరో ప్లేయర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.





















