(Source: ECI | ABP NEWS)
Telangana Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
Telangana CM: ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇస్తే టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తామని తెలంగాణ సీఎం ప్రకటించారు. సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు.

Telangana CM With film workers: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, టికెట్ రేట్ల పెంపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు 24 ఇతర యూనియన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ ప్రసంగించారు. "టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని!" అని స్పష్టం చేశారు.
"సినిమా టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ, పరిశ్రమలో శ్రమిస్తున్న కార్మికులకు – లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్ వంటి వారికి ఏమీ రాదు. అందుకే, ఇకపై టికెట్ రేట్ల పెంపుకు అనుమతి (జీవో) ఇవ్వాలంటే, పెరిగిన రేట్‌లో 20 శాతం మొత్తం తప్పకుండా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి" అని ప్రకటించారు.
Telangana CM Revanth Reddy announced that movie ticket rate hikes will be allowed only if 20% of profits are contributed to the cine workers’ welfare fund.
— Hyderabad Mail (@Hyderabad_Mail) October 28, 2025
He also promised a ₹10 crore deposit for the welfare fund and announced plans to build a school for cine workers’ children… pic.twitter.com/NHLD70uMVF
హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుమీదు.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్‌ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేశారు. . సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు. అధికారంతో నాక ళ్లు మూసుకుపోలేదు.. కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులేనని రేవంత్ అన్నారు.
ప్రభుత్వం తరపున 10 కోట్లు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది మీ హక్కు. మీరు ఎప్పుడు అవసరమైనా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు. కృష్ణనగర్ లో సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ నిర్మిస్తామన్నారు. ఇది ఆధునిక సౌకర్యాలతో, ఉచిత విద్యతో ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. హెల్త్ ఇన్షూరెన్స్, పెన్షన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఈ సమస్యలన్నింటినీ కార్మికులు తన దృష్టికి తెచ్చారని.. ఆరోగ్య కార్డులు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, పెన్షన్ స్కీమ్ ఇవన్నీ మీకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు నియంత్రణ తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను హాలీవుడ్* మార్చాలంటే, ముందు కార్మికుల సంక్షేమం బలోపేతం కావాలన్నారు.





















