Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్ లో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. దాంతో ఎలాగైనా టీ20 సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 29న ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరుగుతుంది.
ఈ టీ20 మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీం ఇండియా బరిలోకి దిగుతుంది. సూర్య కెప్టెన్సీలో ఆసియా కప్ గెలుచుకుంది టీమ్ ఇండియా. గత 5 సంవత్సరాలలో ఆస్ట్రేలియా భారత్ మధ్య 10 టీ20 జరిగాయి. ఇందులో భారత 8 మ్యాచ్‌లలో గెలిచింది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లలో గెలిచింది.
అయితే మొదటి టీ20 మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో వర్షం పడే అవకాశం ఉంది. కాన్‌బెర్రా పిచ్ లో 150-160 పరుగుల స్కోరు మంచిదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కొత్త బాల్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. మరి ఈ మ్యాచ్ లో మన ఇండియా ప్లేయర్స్ ఎలా పెర్ఫర్మ్ చేస్తారో చూడాలి.



















