(Source: ECI | ABP NEWS)
Raviteja : యంగ్ హీరోతో రవితేజ మల్టీస్టారర్ - క్రేజీ కాంబో వేరే లెవల్... మాస్ కామెడీ మామూలుగా ఉండదంతే...
Raviteja Mulit Starrer : సిల్వర్ స్క్రీన్‌పై మరో మల్టీ స్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజ, టాలీవుడ్ యంగ్ హీరో కలిసి మాస్ కామెడీ ఎంటర్టైనర్‌లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Raviteja To Join Hands With Naveen Polishetty For Multistarrer: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజ మరో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది.
యంగ్ హీరోతో...
మాస్ మహారాజ టాలీవుడ్ యంగ్ హీరో 'నవీన్ పోలిశెట్టి'తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన మాస్ కామెడీ ఎంటర్టైనింగ్ స్టోరీని ఇద్దరికీ వినిపించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రసన్న కథను మాత్రమే అందిస్తారా? లేదా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకరు మాస్ హీరో... మరొకరు కామెడీ డైలాగ్స్, పంచెస్‌తో మాస్ కామెడీ ట్రాక్ వేరే లెవల్‌కు తీసుకెళ్లే యంగ్ హీరో.
ఇద్దరిదీ ఒకటే జానర్.. ఒకటే ఎనర్జిటిక్ స్టైల్. స్టార్ హీరోల క్రేజీ కాంబో కావడంతో థియేటర్స్‌లో కామెడీ వేరే లెవల్ కావడం ఖాయమంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టులో మాస్ మహారాజతో ఎలాంటి రోల్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని ఫిలింనగర్ వర్గాల టాక్.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీలో నవ్విస్తూనే థ్రిల్ పంచారు. ఇక 'జాతిరత్నాలు'లో కామెడీ టైమింగ్, పర్ఫెక్ట్ పంచెస్‌తో ఎంటర్టైన్మెంట్ వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. రీసెంట్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక రవితేజ 'మాస్ జాతర' విషయానికొస్తే భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా... యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. నవీన్ చంద్ర, వీటీవీ గణేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న సాయంత్రం 6 గంటల షోస్‌తో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ వేరే లెవల్‌లో ఉండగా ఈ మూవీతో ఆయన హిట్ కొట్టడం ఖాయమంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















