Pratika Rawal Ruled Out | ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ప్రతీకా రావల్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రతీకా అంకల్ కు గాయమైన సంగతి తెలిసిందే.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలయింది. దాంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు తగ్గించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 21 వ ఓవర్ లో బాల్ ను ఆపే క్రమంలో ప్రతీకా రావల్ గాయపడింది. మైదానం వర్షం కారణంగా బాగా తడిగా ఉండడంతో ఆమె కుడికాలు మడిమ మడతపడింది. ఒక్కసారిగా ప్రతీకా అక్కడే పడిపోయింది. నొప్పి తట్టుకోలేక మైదానాన్ని వీడింది.
ఆస్ట్రేలియాతో జరిగే సెమి ఫైనల్ మ్యాచ్ లో ప్రతీకా రావల్ లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా ఆడడం అనుమానంగానే ఉంది. కివీస్‌తో మ్యాచ్‌లో రిచా వేలికి గాయమైంది. రిచా కూడా ఆడకుంటే ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.





















