By: ABP Desam | Updated at : 04 May 2022 08:12 AM (IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ (File Photo)
KTR Sircilla Tour: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివాహ వేడుక సహా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారం, దళితులు నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు శంకుస్థాపన, ఓ సర్పంచ్ సోదరుడి వివాహానికి హాజరు కావడంతో పాటు నేడు సిరిసిల్ల (Telangana IT Minister KTR to visit Sircilla District)లో పలు ఈవెంట్లలో మంత్రి కేటీఆర్ నేడు పాల్గొననున్నారు.
వివాహ కార్యక్రమంతో మొదలు..
ఉదయం 11 గంటలకు సిద్ధిపేటలోని రెడ్డి పంక్షన్ హాల్‌లో జరగనున్న అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాలరెడ్డి కుమారుడి వివాహానికి కేటీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరు కానున్నారు మంత్రి కేటీఆర్.
మధ్యాహ్నం 1 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకోనున్న రైస్ మిల్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మధ్యాహ్నం 1:30 గంటలకు సాయిమణికంఠ గార్డెన్‌లో జరగనున్న రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుని వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు..
ఏపీ, తెలంగాణ సహా ఇతర సెక్షన్స్‌లో మరిన్ని లేటెస్ట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Lokmanya Tilak Express : కరీంనగర్ కు లోకమాన్య తిలక్ రైలు పునరుద్ధరణ, రైల్వేశాఖ మంత్రికి ఎంపీ అర్వింద్ రిక్వెస్ట్
Karimnagar News : రూ. 12 లక్షలు ఇస్తే రూ.కోటి రిటర్న్, ఆ బాబా స్పెషాలిటీ అదే, చివర్లో ట్విస్ట్!
Sirisilla News : ఇద్దరు కుమారులతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమా?
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!