Karimnagar Crime: కరీంనగర్ లోని కో-ఆపరేటివ్ సొసైటీలో భారీ చోరీ, మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు
కరీంనగర్ పట్టణంలో జరిగిన భారీ చోరీని మూడు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దర్ని అరెస్టు చేసి రూ.14 లక్షల సొమ్ము, 13 తులాల బంగారం రికవరీ చేశారు.
కరీంనగర్(Karimnagar) పట్టణంలోని కలెక్టరేట్ వద్ద కో-ఆపరేటివ్ సొసైటీ(Co-Operative Society)లో దొంగతనం సంచలమైంది. కలెక్టరేట్, కమిషనర్ కార్యాలయాల సమీపంలో చోరీ జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపి చోరీ జరిగిన 3 గంటల్లో ఛేదించారు. డబ్బు, బంగారం రికవరీ చేశారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులను కరీంనగర్ సీపీ సత్యనారాయణ(Karimnagar CP Satyanarayana) అభినందించారు. ఈ కేసు వివరాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండానే నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమని సీపీ అన్నారు. నగర ఏసీపీతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని సీపీ ప్రశంసించారు. వారికి నగదు పారితోషకం ఇచ్చి సత్కరించారు. చోరీ అయిన రూ.14,03,969, 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే?
కరీంనగర్ పట్టణ నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి పోలీస్ హెడ్ క్వార్టర్స్(Police Head Quaters) కి కూతవేటు దూరంలో ఈ దొంగతనం జరిగింది. పట్టణంలోని కలెక్టరేట్ ముందు ఉన్న కో-ఆపరేటివ్ సొసైటీ సేవలో 14 లక్షల నగదు చోరీ జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు గల మసీద్ కాంప్లెక్స్(Mazid Complex) లోని ముస్లిం కో-ఆపరేటివ్ సొసైటీ ఉంది. అందులో పలువురు మైనార్టీ వర్గానికి వారు పొదుపు సొమ్ము జమ చేసుకుంటారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దొంగలు సొసైటీలో చొరబడి పద్నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని నిర్వాహకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని సేవ కోపరేటివ్ సొసైటీలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల సమయంలో చొరబడి దొంగతనం చేశాడు. దొంగ లైటు వేసి డబ్బు ఉన్న బీరువా కోసం వెతికాడు. సీసీ కెమెరాల్లో పడకుండా లైట్లు ఆర్పేసి తాళం బద్దలుకొట్టాడు. అయినా ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు సేవా కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తుంటారు. రూ.34 లక్షలు, 8 తులాల బంగారం అపహరణకు గురైనట్లు సొసైటీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నగదును పంజాబ్ నేషనల్ బ్యాంకులో జమ చేయాల్సి ఉందన్నారు. పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. ఐదు సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ఈ సొసైటీ ద్వారా అందిస్తున్నారు.
Also Read: Nizamabad: భార్యకు తెలియకుండా రెండో పెళ్లి, నిజామాబాద్ లో కానిస్టేబుల్ నిర్వాకం