కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్ - చరిత్రలో తొలిసారిగా నగరంలో ప్రతిష్టాత్మక నుమాయిష్
కరీంనగర్ లో ప్రప్రథమంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు,
కరీంనగర్ లో ప్రప్రథమంగా ప్రతిష్టాత్మక నుమాయిష్
ఫిబ్రవరి 15 తర్వాత నిర్వహించడానికి సన్నాహాలు
మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ని కలిసిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు
తెలంగాణతో పాటు యావత్ దేశంలో పేరెన్నికగన్న నుమాయిష్ త్వరలో హైదరాబాద్‌కు దీటుగా రాష్ట్రంలో డెవలప్ అవుతున్న నగరాలలో ఒకటైన కరీంనగర్ లో ప్రప్రథమంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రి గంగులకమలాకర్, రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్‌లో మాత్రమే నుమాయిష్
82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటివరకూ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు, చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఈ ఎగ్జిబీషన్ ను కరీంనగర్‌లో నిర్వహించనుండడం విశేషం.
అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెంది, తీగల వంతెన, మానేరు రివర్ ప్రంట్, ఐటీ టవర్స్ వంటి ఇతర అభివృద్ధి పనులతో ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న కరీంనగర్లో నుమాయిష్ నిర్వహించాల్సిందిగా గతంలో మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన ఆహ్వానం మేరకు నేడు నుమాయిష్ సభ్యులు మంత్రిని, ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ ను కలిసారు.
జనవరి 1 నుండి పిభ్రవరి 15 వరకూ హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 82వ నుమాయిష్‌ను నిర్వహిస్తున్నారు, తదనంతరం ప్రభుత్వ సహకారంతో కరీంనగర్లో నిర్వహించడానికి ప్రతిపాధనలపై చర్చించారు. దీంతో కరీంనగర్ ప్రజలకు అత్యద్భుత ఎగ్జిబీషన్ అనుభవం సాకారం కానుంది.
ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డా. ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వి. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
20 రాష్ట్రాల కళాకారులు
కళలకు కాణాచి అయిన కరీంనగర్ మరోసారి అద్భుత వేడుకలకు వేదికగా మారింది. ఈ కళోత్సవాలు సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించే కళోత్సవాల నిర్వహణ పై కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష (TS Minister Gangula Kamalakar review meeting) నిర్వహించారు. కలెక్టర్ ఆర్ వి కర్ణణ్ తో కలిసి కళోత్సవాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న కళోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. పెద్ద ఎత్తున వచ్చే అతిథులు ప్రేక్షకులకు అనుగుణంగా పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
- ఈ నెల 30న ఉత్సవాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2వ రోజు ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు.
వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు సౌకర్యాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మొత్తం 10 గేట్ల ద్వారా వీక్షకులను అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కళోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. 20 రాష్ట్రాలకు చెందిన కళాకారులు కరీంనగర్ కు చేరుకోగా ఇజ్రాయిల్, మలేషియాకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు కరీంనగర్ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల మంత్రి రాకపోవడంతో స్పీకర్ సంబరాలను ప్రారంభించారు.