News
News
X

అన్నారం బ్యారేజీ వద్ద  ఇసుకమేట- ఆగమైతున్న అధికారులు! 

కరీంనగర్ జిల్లా మహదేవ పూర్ లో నిర్మించిన అన్నారం బ్యారీజీ వద్ద భారీ వరదల కారణంగా ఇసుకమేట సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియక నీటి పారుదల శాఖ అధికారులు తెగ టెన్షన్ పడుతున్నారు. 

FOLLOW US: 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నారం బ్యారేజీ వద్ద ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. మొన్న కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో నీటితోపాటు ఇసుక కూడా కొట్టుకు వచ్చింది. ఇసుక పెద్ద ఎత్తున బ్యారేజీ గేట్ల వద్ద జమ కావడంతో నీటి పారుదల శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. బ్యారేజీ గేట్లకు ఇరువైపులా భారీగా ఇసుక మేట వేయడంతో కొన్ని గేట్లు మూసి వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి వరదలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉండడంతో ఇసుక మేట సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు తర్జనభర్జనా పడుతున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం గోదావరికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అప్పుడు కూడా ఇసుక వల్ల గేట్లకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. అయితే ఆ సమయంలో కాంట్రాక్టర్‌గా ఉన్న సంస్థ 80 కోట్ల ఇన్సూరెన్స్ కోరగా ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు పరిశీలించి తమ నివేదిక అందించారు. 

20 కోట్ల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చని నివేదికలో వెల్లడించారు. దీన్నిబట్టే సమస్య ప్రతీ యేడు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి (CDO) సంబంధించిన ఇంజినీర్లు కూడా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో పరిశీలించి ఇసుక మేట సమస్య ఏ స్థాయిలో ఉందో అప్పుడే ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఒకవైపు నదికి ఎనిమిది మీటర్ల వరకు తేడా వస్తుండడంతో సహజంగానే పెద్ద ఎత్తున అవుతుందని వారు అభిప్రాయ పడ్డారట. ఇక ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ సమస్య మరింత జటిలం అయింది. ఇందులో దాదాపు 66 గేట్లకు గాను 25 గేట్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంది.

ఇసుక తరలింపు సాధ్యమా?? 

నిజానికి ఇంత భారీ ఎత్తున జమ అయిన ఇసుక వల్ల కొన్ని గేట్లు మూసి ఉంచి మరి కొన్నిటిని నీటి పారుదల శాఖ అధికారులు తెరిపించారు. వీటితోపాటుగా దిగువ ప్రాంతానికి ఇసుక వెళ్లి పోయినట్లయితే తిరిగి అన్ని గేట్లు మూసేసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ ఇసుకను తొలగించి తరలించే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా అసలు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీయాల్సి ఉంటుందో ఒక రిపోర్టు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే దీని ప్రకారం రానున్న రోజుల్లో కూడా ఇదే సమస్య రిపీట్ అయితే ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరించగలరనే అంశంపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంపు హౌస్ ని వచ్చే నెల వరకు పని చేసే విధంగా చేయాలంటే బ్యారేజీలో కూడా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఇసుక సమస్యను పరిష్కరించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Published at : 23 Aug 2022 08:17 AM (IST) Tags: Huge Sand Dune at Annaram Barrage Annaram Barrage Latest Problems Annaram Barrage Latest news Sand Dune Mahadevpur Annaram Barrage

సంబంధిత కథనాలు

ప్రాణం పోయింది కానీ విగ్రహాన్ని మాత్రం వదల్లేదు!

ప్రాణం పోయింది కానీ విగ్రహాన్ని మాత్రం వదల్లేదు!

Woman Murdered: రామకృష్ణ కాలనీలో మహిళ దారుణ హత్య - అర్ధరాత్రి తల్లి, బిడ్డపై కత్తులతో దాడి

Woman Murdered: రామకృష్ణ కాలనీలో మహిళ దారుణ హత్య - అర్ధరాత్రి తల్లి, బిడ్డపై కత్తులతో దాడి

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

TRS vs BJP: బీజేపీ వర్సెస్‌ టీఆర్ఎస్ - రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న కార్యకర్తలు

TRS vs BJP: బీజేపీ వర్సెస్‌ టీఆర్ఎస్ - రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న కార్యకర్తలు

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!