Karimnagar News: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని మహిళల కిడ్నాప్ - వేములవాడలో మహారాష్ట్ర కాంట్రాక్టర్ రౌడీయిజం
Vemulawada News: డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకొని ఒప్పందం ప్రకారం కూలీలను పంపించలేదని ఓ కాంట్రాక్టర్ అరాచాకానికి పాల్పడ్డాడు. ఒప్పందం చేసుకున్న వారి కుటుంబాలను కిడ్నాప్ చేశాడు.
Rajanna Siricilla News: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని కుటుంబ సభ్యులపై దాడి చేసి ఓ మహిళను కిడ్నాప్ చేశాడు కాంట్రాక్టర్. మహిళను కిడ్నాప్ చేసే సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి మహిళలు చూడకుండా చితకబాదారు . ఏకంగా ఓ మేస్త్రి తల్లిని బలవంతంగా తన వెంట తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు ఏడ్చిన బతిమాలిన వదిలి పెట్టాలని వేడుకున్న కనికరించలేదు. అనారోగ్యంతో ఉందని చెప్పిన వినిపించుకోకుండా వృద్ధురాలు అని కనికరం లేకుండా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. డబ్బులు ఇచ్చి తమ తల్లిని విడిపించుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు చివరకు కాంట్రాక్టర్‌కు మేస్త్రీకి మధ్య పంచాయతీ ఓ వృద్ధురాలి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కోడి ముంజ గ్రామానికి చెందిన పల్లెపు శ్రీను అనే వ్యక్తి మేస్త్రిగా పనిచేస్తున్నాడు శ్రీను వేరువేరు ప్రాంతాలకు కూలీలను పంపిస్తూ ఉంటాడు,. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన లాలుదివాకర్ అనే కాంటాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలోని దేవకరులో చెరుకు పంట కోసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారు శ్రీనివాస్. ఇందుకోసం కూలీలు అవసరం ఉన్నారని శ్రీనివాస్ అతని సోదరుడిని సంప్రదించాడు.
ప్రస్తుతం శ్రీనివాస్, అతని సోదరుడు ఛత్తీస్‌గఢ్‌లో పనులు చేస్తున్నారు. దివాకర్‌కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కోసేందుకు లేబర్లను పురమాయించేందుకు ఛత్తీస్‌గఢ్ కూలీలతో శీను సోదరుడు ఒప్పందం చేసుకున్నాడు. దీనికి మధ్యవర్తిగా శ్రీనివాస్ వ్యవహరించారు. ఇందుకోసం ముందస్తుగా కాంట్రాక్టర్ దివాకర్ నుంచి శ్రీనివాస్ 3,80,000 తీసుకున్నాడు. కానీ కూలీలు పనులకు రాకపోవడంతో కాంట్రాక్టర్ దివాకర్‌కు మేస్త్రి శ్రీనివాస్ అతని సోదరుడి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో తన డబ్బులు తనకి తిరిగి చెల్లించాలని కాంట్రాక్టర్ దివాకర్ మేస్త్రి శ్రీను అతని సోదరుడిపై ఒత్తిడి చేశారు. ఈ విషయంపై పలుమార్లు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ డబ్బులు చేతికి రాకపోవడంతో కాంట్రాక్టర్ అనుచరులతో శ్రీను గ్రామం కోడిముంజకు వెళ్లారు. శ్రీను ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. శ్రీను అతని సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవపడ్డారు. అదే సమయంలో శ్రీను భార్య అతడి తల్లిపై కాంట్రాక్టర్, అనుచరులు దాడికి దిగారు, అంతే కాకుండా శ్రీను భార్యను తమతో తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్ ప్రయత్నించడంతో శ్రీనివాస్ సోదరుడి కుమారుడు పక్కింట్లో దాచి ఉంచాడు. దీంతో ఇంట్లో ఉన్న శీను తల్లి భీమా భాయ్‌నీ బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు.
డబ్బులు ఇచ్చి శ్రీను తన తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడ నుంచి కాంట్రాక్టర్ మనుషులు వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న బీమా భాయ్ బలవంతంగా కారు ఎక్కిస్తుండగా కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వేడుకున్నా కాంట్రాక్టర్ అనుచరులు భీమాభాయిని ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంట్రాక్టర్ అతని అనుచరులపై కేసును నమోదు చేసిన పోలీసులు
బీమాబాయి మనవడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాంట్రాక్టర్ కోసం గాలించారు. . రెండు బృందాలుగా విడిపోయి వెతికారు. సాంకేతికత ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి లాలు నాగోరావ్ దయారంగ అతని భార్య పంచతుల బాయిని అదుపులోకి తీసుకొని వేములవాడ తీసుకొచ్చారు. భీమ భాయిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిసింది.