News
News
X

Karimnagar Crime : వీళ్లెక్కడి దొంగలురా బాబు, కన్నుపడితే ట్రాన్స్ ఫార్మర్లు మాయం!

Karimnagar Crime : ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ట్రాన్స్ ఫార్మర్ దొంగల పనిపట్టారు పోలీసులు. వరుస చోరీలతో అలర్ట్ అయిన పోలీసులు నిఘా పెట్టి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 
 
Karimnagar Crime : చిన్నచిన్న వస్తువులు దొంగతనం చేయడంలో కిక్కు దొరకలేదేమో ఓ గ్యాంగ్ ఏకంగా ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తూ పోలీసుల చేతికి చిక్కింది. కొంత కాలంగా వరుసగా ట్రాన్స్ఫార్మర్ల చోరీకి  పాల్పడుతూ అటు పోలీసులను, ఇటు విద్యుత్ శాఖ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్న ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 31 ట్రాన్స్ఫార్మర్లు దొంగలించిన నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి నేరం చేసేందుకు ఉపయోగించిన వాహనాలతో పాటు 2.07 క్వింటాళ్ల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చెన్నూరి రూపేష్ నిందితుల వివరాలను తెలిపారు.

ముఠాగా ఏర్పాడి టాన్స్ ఫార్మర్ల చోరీ 

సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని కనుకుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముంజంపల్లి గ్రామానికి చెందిన పండరి రఘు, పండరి నరేష్, పండరి వెంకటేశంతో పాటు ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన మౌటం కుమారస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల వద్ద నుంచి కాపర్ వైర్ స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో 9 మంది ముఠాగా ఏర్పడి పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 18, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సుల్తానాబాద్ లో 1, జూలపల్లిలో 1, జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6  ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసి అందులోని కాపర్ వైర్ ను అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు.  

11 మంది అరెస్టు 

News Reels

బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్, ధర్మారం ఎస్సై శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి మొత్తం తొమ్మిది మంది నిందితులతో పాటు ఇద్దరు కొనుగోలుదారులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెన్నూరి రూపేష్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.07 క్వింటాళ్ల కాపర్ వైరు, ఒక కారు, ఒక టాటా ఏసీతో పాటు 6 ద్విచక్ర వాహనాలు,  వేయింగ్ మెషిన్, కాపర్ వైర్ తీసేందుకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడిన పండరి రఘు, పండరి నరేష్, పండరి వెంకటేశం, వేంపల్లి సతీష్, ధర్మాజీ ప్రభాకర్, అరుగుల శ్రీకాంత్, ముచ్చర్ల ప్రశాంత్, పండరి రాజేందర్, అరుగుల రజనీకాంత్ తో పాటు కాపర్ వైర్ కొనుగోలు చేసిన మౌటం కుమారస్వామి, పస్తం హనుమంతులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

అనుమానిత వ్యక్తులు సంచరిస్తే 

కొన్ని నెలలుగా పెద్దపెల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి  ఆదేశాలతో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్, సీఐ ఇంద్రసేన రెడ్డి,  పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ లు ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై దృష్టి సారించారని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన ఏసీపీ, సీఐ , ఇతర సిబ్బందిని అభినందించడంతో పాటు నగదు రివార్డులను అందజేశారు. 

Published at : 27 Oct 2022 04:56 PM (IST) Tags: Crime News Karimnagar News TS Police Transformers thieves copper wire

సంబంధిత కథనాలు

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

Nizamabad News : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, బడితపూజ చేసిన తల్లిదండ్రులు!

Nizamabad News : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, బడితపూజ చేసిన తల్లిదండ్రులు!

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్