Kaleshwaram Report: తప్పంతా కేసీఆర్‌దే - రీడిజైన్‌తోనే అక్రమాలు - జస్టిస్ ఘోష్ రిపోర్టును వెల్లడించిన ఉత్తమ్
Minister Uttam: కాళేశ్వరం కార్పోరేషన్ ద్వారా అవకతవకలు జరిగాయి. వాటిపై విచారణ జరపాలని ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. మంత్రి ఉత్తమ్ నివేదికలోని అంశాలను వెల్లడించారు.

Justice Ghosh report on the irregularities in the Kaleshwaram project: ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం కేసీఆర్ సొంత నిర్ణయమని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేబినెట్ మీటింగ్ తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టులో కీలమైన అంశాలతో కూడిన 25 పేజీలను ప్రజల ముందు పెట్టారు. రాజకీయాల అంశాలతో సంబంధం లేకుండా పీసీ ఘోష్ కమిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమిషన్ 605 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. నివేదికను 25 పేజీలకు కుదించి కమిటీ క్లుప్తంగా అందించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలున్నాయని NDSA కూడా చెప్పిందని స్పష్టం చేశారు.
నిపుణుల నివేదికల్ని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. బ్యారేజ్ కుంగిన సమయంలో కేసీఆరే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నేషనల్ డ్యామ్ అథారిటీ మేడిగడ్డ కుంగుబాటుపై నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు నింపితే కూలిపోతాయని నేషనల్ డ్యాం అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని.. కమిషన్ జ్యుడిషియల్ పరంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ మూడు బ్యారేజీలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అధిక వడ్డీలతో రూ.84వేల కోట్లు అప్పు తెచ్చిందని తెలిపారు. రుణాలు తెచ్చే విషయంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని గతంలో నిర్ణయించారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉన్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి స్థలాన్ని మార్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అప్పట్లో 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారని కానీ కేసీఆర్(KCR) సీఎం అయ్యాక ఇష్టానుసారం డిజైన్లు మార్చేశారని జస్టిస్ ఘోష్ కమిషన్తేల్చింది. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం అన్నీ కేసీఆరే చేశారని నివేదికలో వెల్లడయింది. అప్పుడు సీఎం, నీటిపారుదల మంత్రి రెండు కేసీఆర్ ఉన్నారు. 2016లో కాళేశ్వరం అగ్రిమెంట్ జరిగింది.. 2019లో పనులు ప్రారంభమయ్యాయి. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగిపోయింది.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉ ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పింది. మేడిగడ్డ వద్ద కట్టొద్దని సూచించినా కేసీఆర్ వినలేదని .. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని రిపోర్టు చెప్పింది.
తుమ్మిడిహట్టి, మేడిగడ్డకు మార్చడం వెనక నిజాయితీ లేదు. తుమ్మిడిహట్టిలో 205 టీఎంసీల నీటి లభ్యత ఉండదని.. హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తున్నామని నాటి కేంద్రమంత్రి ఉమాభారతి లేఖరాశారు. సీడబ్ల్యూసీ కూడా ఇదే చెప్పింది. కేంద్రమంత్రి లేఖను కేసీఆర్ పక్కనబెట్టారని జస్టిస్ పీసీ ఘోష్ గుర్తించారు.
తొమ్మిడిహట్టిలో నీళ్లు లేవనడం.. కేవలం సాకు మాత్రమే.. నాటి ప్రభుత్వం అబద్ధం చెప్పింది. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కూడా మేడిగడ్డ వద్ద నిర్మించవద్దని సూచించిందని నివేదికలో వెల్లడయింది. ఆ రిపోర్టును కేసీఆర్ పట్టించుకోలేదు. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేమనపల్లి దగ్గర కట్టాలని చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. కేసీఆఆర్, హరీశ్ కావాలనే రిపోర్టు లను పక్కనపెట్టారని కమిషన్ తేల్చింది. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టి ప్రాజెక్ట్ నిర్మించారు. మేడిగడ్డ సరైంది కాదు.. రిపోర్టులు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలేదని ఉత్తమ్ తెలిపారు.
క్యాబినెట్ అనుమతిలేకుండా రూ. 2,591 కోట్ల రూపాయలకు ఇరిగేషన్ మంత్రి జీవోతో అనుమతి ఇచ్చారని కమిషన్ గుర్తించింది. నామినేషన్ ద్వారా అడిషనల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ ఇచ్చారు. క్యాబినెట్ అనుమతి లేకుండా సీఎం ఇచ్చారు .. ఇది నిబంధనలకు వ్యతిరేకమని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తెలిపింది.





















