By: ABP Desam | Updated at : 17 Feb 2022 11:32 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
LOVE_MARRIAGE
సోషల్ మీడియా(Social Media) పరిచయాలు కొన్ని సార్లు చేదు అనుభవాలను మిగిల్చితే మరికొన్ని సార్లు తీపి గుర్తులను అందిస్తాయి. ఎప్పుడో చదువుకున్నప్పుడు కలిసిన మిత్రుడ్ని మళ్లీ కలిసేలా చేస్తాయి. అలాగే కొత్త పరిచయాలతో మరింత మందిని స్నేహితుల్ని చేస్తాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లిళ్లు జరిగిన ఘటనలు కూడా తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా(Jagityala District)లో జరిగింది. సోషల్ మీడియా వారి మూగమనసులను కలిపింది. ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా ప్రేమించుకున్నారు. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు.
వారిద్దరికీ మాటలు రావు కానీ వారి మనసులు మాట్లాడుకున్నాయి. సామాజిక మాధ్యమం ద్వారా ఏర్పడిన వారి పరిచయం పెళ్లి వరకూ నడిచింది. సోషల్ మీడియా పరిచయ ప్రేమల్లో నూటికి 90 శాతం మోసపోయిన వాళ్లే ఉంటారు. కానీ వీరి ప్రేమకు శుభమ్ కార్డు పడింది. ఇద్దరు తమ భావాలను పంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Medaram Jatara 2022: ఆ ప్రదేశంలో చిన్న తప్పు చేసినా తేనెటీగలు వెంటాడుతాయట
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఉన్నవారిని సైతం క్షణాల్లో పలకరించగలిగే సౌకర్యం. కొత్తవారితో స్నేహం కోసం సోషల్ మీడియా ఎంతగానో సహకరిస్తుంది. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను హ్యాపీ ఎండింగ్ ఇచ్చేందుకు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కలిసిన ఆ మూగమనసులు ఒకటయ్యారు. తెలంగాణ(Telangana) జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో వారి పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాయికల్‌కు చెందిన అత్రం లత అలియస్ జ్యోతి అనే యువతి ఒంగోలు(Ongole)కు చెందిన అరుణ్ అనే యువకుడు ఇద్దరూ మూగవారే. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో ఇద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. వారి భావాలను పంచుకున్నారు. వీళ్లిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానిక యువకుల సహకారంతో ఇద్దరూ ఒకటయ్యారు. సామాజిక కార్యకర్తలు రియజుద్దీన్, కాసారపు రమేష్ ,మహ్మద్ బాబుజాన్ వారికి దగ్గరుండి పెళ్లి జరిపించారు.
Also Read: KCR Birthday Wishes: కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం, కడియంలో తెలంగాణ సీఎం జన్మదిన వేడుకలు
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Breaking News Live Updates: నిజామాబాద్ నుంచి కాశీకి యాత్రికుల బస్సు, బిహార్‌లో బోల్తా
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు
Deepika padukune: డ్రెస్సా? దుప్పటి చుట్టుకున్నావా? దీపికా డ్రెస్ పై కామెంట్లు