TriColour IT Raids : రియల్ ఎస్టేట్ కంపెనీలో గుట్టలుగా నోట్ల కట్టలు - పదహారు చోట్ల ఐటీ సోదాలు !
ట్రైకలర్ ప్రాపర్టీస్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసులో భారీగా నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది.
TriColour IT Raids : దేశంలో ఓ వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడులు కలకలం రేపుతూండగా.. హైదరాబాద్‌లో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ట్రైకలర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయాలపై దాడులు చేశారు. దేశవ్యాప్తంగా 16 చోట్ల ట్రైకలర్ కంపెనీకి చెందిన కార్యాలయాల్లోసోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్త్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే 10 ప్రాంతంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్, ముంబై, పాట్నా ఢిల్లీ బెంగళూరు చెన్నై స హాపలు పట్టణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం సీజ్ చేసిన ఈడీ - మనీలాండరింగ్ కేసులో కీలక అడుగు !
ట్రైకలర్ కంపెనీకి చందన్ కుమార్ ఝా చైర్మన్ , మేనేజింగ్ డైరక్టర్‌గా ఉన్నారు. రంజన్ కుమార్ ఝా, దిగంబర్ ఝా ఇతర కీలక పదవుల్లో ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ సంస్థ హైదరాబాద్, విశాఖతో పాటు మరో నాలుగు నగరాలు, యూఏఈలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. అపార్టుమెంట్లతో పాటు స్థలాలను అభివృద్ది చేసి ప్లాట్లుగా వేసి విక్రయిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటి అయినప్పటికీ లో ప్రోపైల్‌లోనే ఉంటుంది . తమ వెంచర్లకు ఎప్పుడూ భారీ ప్రచారాలు చేసుకోలేదు. దీంతో ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఏపీ తీర ప్రాంతానికి కోత ముప్పు - లోక్‌సభలో కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం !
ఈ సంస్థ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ దానికి తగ్గట్లుగా పన్నులు కట్టడం లేదన్న ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సోదాలు .. మరో ఒకటి రెండు రోజుల పాటు సాగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో పలు రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పెద్ద ఎత్తున పన్నులు చెల్లించని విషయాన్ని గుర్తించినట్లుగా సీబీడీటీ ప్రకటించింది. ఇప్పుడు మరో హైదరాబాద్ కంపెనీని టార్గెట్ చేయడంతో హాట్ టాపిక్ అవుతోంది.
ఈడీ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితం అన్న చర్చ జరుగుతున్న సమయంలో సహజంగానే తెలంగాణలో ఐటీ దాడుల వెనుక కూడా ఏదైనా రాజకీయం ఉందా అని చూస్తున్నారు. ట్రైకలర్ కంపెనీతో ఎవరైనా రాజకీయ నేతలకు సంబంధాలున్నాయా అన్న వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ట్రైకలర్ కంపెనీతో ఏ రాజకీయ నేతకుకానీ.. ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కానీ సంబంధాలున్నట్లుగా స్పష్టత లేదు.