Schools holiday : తెలంగాణలో విద్యార్థి సంఘాల బంద్ పిలుపు - బుధవారం స్కూళ్లకు సెలవు - ఇదిగో నిజం
Telangana Schools: తెలంగాణలో బుధవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. స్కూళ్ల యాజమాన్యాల నిర్ణయం మేరకు సెలవులు ప్రకటిస్తారు.

Telangana bandh tomorrow: తెలంగాణలో బుధవారం స్కూల్స్ ఉంటాయా లేదా అన్న దానిపై అనేక సందేహాలు వస్తున్నాయి. విద్యార్థి సంఘాలు స్కూల్ బంద్‌కు పిలుపునివ్వడంతో ..చాలా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సెలువు ఇచ్చాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు మెసెజ్ చేశాయి. కొన్ని స్కూళ్లు మాత్రం క్లాసులు నిర్వహించే ఆలోచనలో ఉన్నాయి. అలాంటి స్కూళ్లు తమ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి మెసెజులు పంపలేదు. అయితే విద్యార్థి సంఘాలు దాడి చేస్తాయన్న అనుమానం ఉంటే.. సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అధికారికంగా అయితే స్కూళ్లకు ఎలాంటి సెలవు లేదు.
బంద్ పిలుపును ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) పిలుపునిచ్చాయి. విద్యా రంగంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో వసూలు చేసే అధిక ఫీజులపై చట్టపరమైన నియంత్రణ కోసం ఒక స్పష్టమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యా రంగానికి ప్రత్యేకమైన మంత్రిని నియమించాలని కోరుతున్నారు, ఇది విద్యా వ్యవస్థ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుందని అంటున్నారు. రూ. 8,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలల్లో తగిన మౌలిక సదుపాయాలు అంటే భవనాలు, తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్‌లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
టీచర్లు, MEOలు (మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు), DEOలు (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు) వంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని.. జూనియర్ కళాశాలలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్టూడెంట్ బస్ పాస్ సబ్సిడీలను పునరుద్ధరించాలలని.. తెలంగాణ ప్రభుత్వం NEP 2020ని తిరస్కరించాలని డిమాండ్, ఇది విద్యార్థుల హక్కులను దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నారు.
జూలై 23, 2025న తెలంగాణలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు బంద్ కారణంగా మూతపడే అవకాశం ఉంది. అయితే, ఇది అధికారిక సెలవు కాదు, కానీ భద్రతా కారణాల దృష్ట్యా చాలా విద్యా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.



















