MBBS/BDS Counselling 2025: తెలంగాణ నీట్ విద్యార్థులకు ముఖ్య గమనిక! కౌన్సెలింగ్ గైడ్, ఫీజులు, డాక్యుమెంట్లు & మరిన్ని వివరాలు
MBBS/BDS Counselling 2025 :తెలంగాణలో MBBS /BDS Counselling 2025కు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడున్నాయి. కాలేజీలు, ఫీజులు, కౌన్సెలింగ్ ప్రక్రియ తెలిపే గైడ్ ఇది.

MBBS/BDS Counselling 2025 : నీట్ రాసి వైద్య విద్యను అభ్యసించాలని ఉత్సాహంతో ఉన్న తెలంగాణలో విద్యార్థులు కౌన్సెలింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమిక సమాచారం తెలుసుకుంటే గానీ ప్రక్రియను సాఫీగా పూర్తి చేయలేరు. ఎంబీబీఎస్‌కు ఎలా అప్లై చేయాలి. బీడీఎస్‌కు ఎలా దరఖాస్తు చేయాలి. రెండింటికీ కలిసి చేయాలా లేకుంటే విడివిడిగా ఫీజులు చెల్లించాలా ఇలాంటి అనుమానాలు చాలానే ఉంటాయి. కాలేజీలు ఎన్ని ఉన్నాయి. వాటిలో సీట్లు ఏ కేటగిరికి ఎన్ని వస్తాయో తెలుసుకున్న తర్వాత అప్లై చేయడం సులభమవుతుంది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.
2025-26 సంవత్సరానికి ఎంబీబీఎస్/బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ యాక్టివ్‌లో ఉంది. జులై 15న ఇచ్చిన నోటఫికేషన్ ప్రకారం విద్యార్థులు ఫీజులు చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. జులై 16న ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 25 సాయంత్రం 6 గంటల వరకు యాక్టివ్‌గానే ఉంటుంది. అంటే మరో 3 రోజుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది.
నీట్-2025లో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్/ బీడీఎస్‌లో చేరేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించిన వారంతా ఇప్పుడు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. జులై 25 సాయంత్ర 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రొవిజినల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్స్ డేట్స్ తెలియజేస్తారు. తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా వెల్లడిస్తారు.
నీట్ కటాఫ్ ఇలా
నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎంత వరకు కటాఫ్ ఉంటుందనే అనుమానం ఉండటం సహజం. గత కొన్నేళ్లుగా ఉన్న సినారియో, అందుబాటులో ఉన్న సీట్లు గమనిస్తే కటాఫ్ ఈ కింది విధంగా ఉంటుందని చెబుతున్నారు.
- జనరల్ కేటగిరి/ ఈడబ్ల్యూఎస్- 50th పర్సంటైల్- 144 మార్కులు
- ఎస్సీ/ఎస్టీ/బీసీ అండ్ పీడబ్ల్యూడీ -40th పర్సంటైల్- 113 మార్కులు
- ప్రత్యేక అవసరాల అభ్యర్థులు- 45th పర్శంటైల్- 127 మార్కులు
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే విద్యార్థులు కొంత ఫీజు చెల్లించాలి. దీన్ని తిరిగి ఇవ్వబోరు.
రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు వివరాలు
- ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు- రూ. 4000 (దీనికి బ్యాంకు లావాదేవీలు ఛార్జులు అదనం)
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు- రూ. 3200/(దీనికి బ్యాంకు లావాదేవీలు ఛార్జులు అదనం)
- ఒకసారి ఈ ఫీజు చెల్లిస్తే దీన్ని తిరిగి వెనక్కి తీసుకోవడానికి లేదు. వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా వీలు లేదు.
కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు
కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సిన అభ్యర్థులు ముందు కొన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈఫైల్స్ 500 కేబీ కంటే ఎక్కువ ఉండకూదు. అలా ఉంటే మాత్రం అప్‌లోడ్ కావడం కష్టమవుతుంది.
- 1. నీట్ యూజీ- 2025 ర్యాంక్ కార్డు
- 2. బర్త్ సర్టిఫికెట్(ఎస్సెస్సీ మార్క్ మెమో)
- 3.క్వాలిఫయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్(ఇంటర్మీటియెట్ మార్క్స్ మెమో)
- 4. 9- 10 వ తరగతి స్టడీ సర్టిఫికెట్స్
- 5. రెండేళ్ల ఇంటర్మీడియెట్ స్టడీ సర్టిఫికెట్
- 6. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్
- 7. ఆధార్ కార్డ్
- 8. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు(JPG/JPEG, ఇవి 100 కేబీకి మించకూడదు)
- 9. సంతకాల నమూనాలు(JPG/JPEG, ఇవి 100 కేబీకి మించకూడదు)
కేటగిరి వర్తిస్తే కావాల్సిన స్పెసిఫిక్ డాక్యమెంట్స్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ కేటగిరిని ధ్రువీకరిస్తూ కొన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. వీటిని ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి.
- తండ్రి పేరు మీద ఉన్న తాజా కుల ధ్రువీకరణ పత్రం
- ముస్లింలు అయితే మైనారిటీ సర్టిఫికెట్
- తహసీల్దార్ ఇచ్చిన 2025-26 EWS సర్టిఫికెట్
- ఎన్‌సీసీ సర్టిఫికెట్(1500 కేబీకి మించకూడదు)
- సీఏపీ సర్టిఫికెట్ (1500 కేబీకి మించకూడదు)
- పీఎంసీ సర్టిఫికెట్
- ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్
- రెసిడెన్స్ సర్టిఫికెట్
రిజర్వేషన్ వివరాలు
వివిధ కేటగిరిలకు సీట్లలో రిజర్వేషన్లు కల్పించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఈ కింది విధంగా రిజర్వేషన్లు ఉంటాయి.
- ఎస్సీ- 15% సీట్లు
- ఎస్సీ గ్రూప్-i 1%
- ఎస్సీ గ్రూప్-ii 9%
- ఎస్సీ గ్రూప్-iii 5%
- ఎస్టీ అభ్యర్థులు- 10%
- బీసీ అభ్యర్థులకు -29%
- బీసీ-ఏ- 7%
- బీసీ-బీ- 10%
- బీసీ-సీ- 1%
- బీసీ-డీ- 7%
- బీసీ-ఈ- 4%
ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
మహిళలకు రిజర్వేషన్- 331/3%
దివ్యాంగులకు రిజర్వేషన్- 0.25%
ఎన్‌సీపీ క్యాడేట్స్- నీట్ స్కోర్‌కు గ్రేస్‌మార్కులు కలుపుతారు. (మీకు ఉన్న సర్టిఫికెట్‌ను బేస్ చేసుకొని 3-7 % కలుపుతారు)
కాలేజీల వివరాలు
తెలంగాణలో నీటి రాసిన విద్యార్థులు ప్రభుత్వం, ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడైనా వారి వారి ర్యాంకును బట్టి చేరవచ్చు. ఎన్ని కాలేజీలు ఉన్నాయో, వాటిలో ఫీజులు ఎలా ఉంటాయో చూస్తే మాత్రం కచ్చితంగా విద్యార్థులు ఓ అంచనాకు రావచ్చు. దాని ప్రకారం కాలేజీలు టిక్ చేసేపని ఈజీ అవుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా 27 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 3790 సీట్లు ఉన్నాయి. ముఖ్యమైన ప్రభుత్వ కళాశాలలు ఇవే
- ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్-250 సీట్లు
- గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్-250 సీట్లు
- కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్-250 సీట్లు
- ఏఐఐఎస్ తెలంగాణ, బీబీనగర్-100 సీట్లు
ప్రైవేటు కాలేజీలు ఫీజుల వివరాలు
తెలంగాణ వ్యాప్తంగా 28 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 4300 సీట్లు ఉన్నాయి.
- కేటగిరి ఏ(ప్రభుత్వ కోటాలో సీటు వస్తే)-60 వేలు ఫీజులు చెల్లించాలి
- కేటగిరి బీ(మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే)- 11.55-14.50 లక్షలు ఫీజులు చెల్లించాలి.
- కేటగిరి సీ(ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీటు వస్తే)- కేటగిరి బీ ఫీకంటే రెండు రెట్ల వరకు చెల్లించాలి
ప్రభుత్వ కాలేజీల్లో పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఏడాదికి చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.
- 1. మొబైల్ అండ్ మెయిల్ రిజిస్ట్రేషన్(ఒకసారి చేయాల్సిన పని )
- 2. ఫీజు చెల్లింపుతో కలిసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్
- 3. డేట్ అప్‌డేటింగ్(వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు ఎడిట్ చేసుకోవచ్చు)
- 4. సర్టిఫికేట్ అప్‌లోడ్(వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు ఎడిట్ చేసుకోవచ్చు)
వెబ్ బైస్డ్ కౌన్సెలింగ్
వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సులకు వేర్వేరుగా ఆప్షన్స్ ఇవ్వాలి.
ఆప్షన్స్‌లో ప్రయార్టీ ఇవ్వాలి. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ తేదీలను సపరేట్‌గా విడుదల చేస్తారు. వివిధ దశల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు
ముఖ్య గమనిక
అభ్యర్థులు తల్లిదండ్రులు, అభ్యర్థి సర్టిఫికెట్ ఒరిజినల్‌వేనంటూ ధ్రువీకరిస్తూ రూ. 100/- నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్/అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కోర్సు నుంచి వెళ్లిపోవాలంటే రెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ టైంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, బాండ్స్ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి కేవలం డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌ను మాత్రమే ఉపయోగించాలి. మొబైల్స్ లేదా టాబ్లెట్స్‌ను వాడొద్దు. మంచి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ రావడానికి మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ యాక్టివ్‌గా ఉండేలా చూడండి.
ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే...
- కాళోజీ నారాయణరావు హెల్త్‌సైన్సెస్ విశ్వవిద్యాలయం వరంగల్ ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్‌లు చేయండి
- కౌన్సెలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 7901098840, 9490585796
- సాంకేతిక సమస్యలు: 9392685856, 9059672216, 7842136688
- సర్టిఫికెట్ ధృవీకరణ సమాచారం కోసం : 9866092370
- చెల్లింపు సమస్యలు వస్తే : 9618240276





















