(Source: ECI/ABP News/ABP Majha)
YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ
వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా రోజూ జనం పెద్దఎత్తున కనిపిస్తున్నారు. షర్మిలతో కలిసి నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిశారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సమీపంలో సాగుతోంది. ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. మధ్యలో బహిరంగ సభలు, రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీలు జరుపుతూ బిజీబిజీగా ఉంటున్నారు.
అయితే, ఆదివారం వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్, వైఎస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వైఎస్ షర్మిలను కలిశారు. పాదయాత్రలో షర్మిలను కలిసి వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వివరించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డితో జనం సెల్ఫీలు దిగారు.
వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా రోజూ జనం పెద్దఎత్తున కనిపిస్తున్నారు. షర్మిలతో కలిసి నడుస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా రోజూ రచ్చబండ తరహాలో ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమం సాగిస్తున్నారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు సాగనున్న సంగతి తెలిసిందే. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. మొత్తం 14 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.
కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారా? లేక గాడిదలు కాస్తున్నారా? అంటూ ఈ స్థాయిలో ఫైర్ అవుతున్నారు.. వైఎస్ షర్మిల. ఆయన ఫామ్ హౌస్‌లో మొద్దు నిద్ర పోతున్నారని.. 36 లక్షల మంది రైతులను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహించారు. ప్రజలు తాళి బొట్టు తాకట్టు పెట్టి మరీ ఫీజులు కడుతున్నారని.. తమ బతుకులు ఆగం అయ్యాయని షర్మిల విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని.. కరోనా అని కూడా చూడకుండా ఈ నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.30 పెంచారని అన్నారు. కేసీఆర్, బీజేపీ కలిసి పెట్రోల్ ధరలు పెంచి రక్తం పిండుతున్నారని అన్నారు. ఇందులో బీజేపీకి ఎంత పాపం ఉందో కేసీఆర్‌కి అంతే పాపం ఉందని మండిపడ్డారు.
Also Read: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్