అన్వేషించండి

Hydra: ఇల్లు కూల్చినా EMI కట్ అవుతోంది - హైడ్రా బాధితుల కన్నీటి వెతలు

Hydra: హైదారాబాద్ లోని మల్లంపేట్ కత్వా చెరువు వద్ద ఏకంగా 17 విల్లాలను నేలమట్టం చేసింది హైడ్రా. లక్షలాది రూపాయలు లోన్ తీసుకుని నిర్మించుకున్న ఇళ్లు నేలపాలైనా EMI వేధింపులు మాత్రం ఆగడంలేదు.

HYDRA victims : మెరుపువేగంతో దూసుకుపోయిన హైడ్రా మిగిల్చిన గాయాలు ఇప్పటికీ బాధితులను వెంటాడుతూనే ఉన్నాయి. మొదట్లో ఉన్న జోరు ఇప్పుడు హైడ్రాలో కనిపించడంలేదు. హైడ్రా కూల్చిన ఇళ్లు, బాధితుల దుస్దితిపై ABP దేశం ద్రుష్టిసారించింది. క్షేత్రస్దాయిలో హైడ్రా గాయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద కూలిన విల్లాలను కొన్న బాధితులను పలకరించింది. ఇప్పుడు కలల సౌధం లేదు. నేల మిగిలినా మీాది కాదు.మరి బ్యాంకులకు  EMI చెల్లిస్తున్నారా అని ప్రశ్నిస్తే ., వారి ఆవేదనకు అవదుల్లేవు. ఏకంగా కొందరు ఆత్మహత్యలకు సిద్దమవుతున్న చేబుతున్న మాటలు వింటుంటే.. అయ్యో ఇదేం దుస్దితి అనిపిస్తోంది.  

ఇల్లు లేదు కానీ ఈఎంఐ మాత్రం ఠంచన్   

మల్లంపేట్ కు చెందిన శశాంక్ ,కత్వా చెరువు వద్ద విల్లా  కొనుగోలు చేశాడు.  ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నా ఇళ్లు కూల్చేశారు. ఇప్పుడు మేము ఎవరిని  కలవాలి. గతంలో అనుమతులు ఇచ్చినవారు సమధానం చెప్పే పరిస్దితిలేదు. బ్యాంక్ లు మాత్రం ఇవన్నీ మాకు సంబంధంలేదు. మీరు లోన్ తీసుకున్నారు. తీసుకునేటప్పుడు 50 డాక్యూమెంట్లపై సంతకాలు చేశారు. ఏదైనా ఈ విషయంలో మాట్లడాలంటే మా అడ్వకేట్ తో మాట్లడుకోండి అంటున్నాయి. లీగల్ ప్రొసెస్ ఓకే అనుకునే మీరు బ్యాంక్ లోనూ ఇచ్చారు.ఇప్పుడు కూల్చేస్తుంటే బ్యాంకును మేము నిలదీశాము.వారి నుండి మాకు సంబంధంలేదు అనే సమాధానం వస్తోంది. మాలోన్ కు ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధంలేదు. ఎమ్మార్వో ,సబ్ రిజిస్ట్రర్ ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారో మేము జొోక్యం చేసుకోము అంటున్నారు బ్యాంక్ అధికారులు.

ఈఎంఐలు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్న బ్యాంకులు 

నేను కత్వా చెరువుకు సమీపంలో విల్లా కొనేందుకు 70లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకున్నాను. మూడు నెలల క్రితం హైడ్రా మా విల్లా బఫర్ జోన్ లో ఉందంటూ కూల్చేసింది. ఇళ్లు కూలినా మాకు ప్రతీ నెలా EMI మాత్రం కట్ అవుతూనే ఉంది.  ఇళ్లు కూలినా, కనీసం స్దలం కూడా నాది కాదు అని తెలిసినా నేను ప్రతీ నెలలా ఎవరికి కడుతున్నానో ,ఎందుకు కడుతున్నానో తెలియకుండా ఏకంగా 51,258/- రూపాయలు EMI నా అకౌంట్ నుండి కట్ అవుతోంది. ఇల్లు లేకుండా ఎందుకు కడుతున్నారు నాన్న అని మా పిల్లలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను పడుతున్న ఆవేదన మాటల్లో చెప్పలేనిది. సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు బ్యాంక్ కు కడుతున్నాము. ఇదే డబ్బు ఉంటే పిల్లల భవిష్యత్ కోసం మరో చోట ఇన్వెస్ట్ చేసేవాళ్లం. ఏడాదికి ఆరు లక్షల రూపాయలు ఎక్కడైనా కడితే మా పిల్లల చుదువులు పూర్తయిపోతాయి. అకౌంట్ లో అమౌంట్ కట్ అయినరోజు నా భార్యకు మొఖం కూడా చూపించలేకపోతున్నామంటే మా దుస్దితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. న్యాయం కోసం ఎవరితో పోరాటం చేయాలి అనేది కూడా తెలియదు.

అపార్టుమెంట్లే కూల్చేశారు ! 

నాకు నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్లు సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి.వచ్చిన ఫిఎఫ్ డబ్బులు, దాచుకున్న డబ్బులతో ఓ చిన్న అపార్ట్ మెంట్ కట్టి, తెలిసిన బంధువులకు, స్నేహితులకు అందులో ప్లాట్లు అమ్మేశారు. హైడ్రా వచ్చి మొాత్తం అపార్ట్మెంట్ కూల్చేశారు. ఇప్పుడు వాళ్ల పరిస్దితి అత్యంత దయనీయం. బంధువులను తప్పించుకు వెళ్లలేరు.డబ్బులు తిరిగి ఇవ్వలేరు.సాలరీ లేదు, పిఎఫ్ డబ్బులేదు.పైసాలేదు. వారిలో  ఓ స్నేహితుడు నాతో ఏమంటున్నాడంటే. నేను నా ఇంటికోసం బ్యాంక్ లోన్ తీసుకున్నాను. దాన్ని వేరే బ్యాంక్ కు బదిలీ చేసి, దానిపై ఇన్సురెన్స్ తీసుకుని , రెండు నెలల తరువాత న్యాచురల్ డెత్ ప్లాన్ చేద్దామనుకుంటున్నా. అలా చేయడం వల్ల కనీసం నా కుంటుంబానికి కనీసం ఇలైనా మిగులుతుందని నా స్నేహితుడు చెప్పిన మాటలతో నాకు మూడు రోజులు నిద్రపట్టలేదు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే హైడ్రా మిగిల్చిన దుస్దితికి.

Also Read: Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

ఎందుకు కూలగొట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదంటున్న బాధితులు

ఎందుకు కూలగొట్టారో.,ఏం చేద్దామనుకున్నారో హైడ్రాతో ఇప్పటికీ ఎవరికీ అర్దం కావడంలేదు. మా బ్యాంక్ లోన్ పరిస్దితి ఏంటి. ఎవరిని కలవాలి. మాకోసం కనీసం న్యాయవాదిని పెడతారా.. ఏం చేస్తారో ఎవరూ చెప్పలేదు. మీ చావు మీరు చావండి అన్నట్లు వదిలేశారు. ఒకవేళ మేము లోన్ కట్టకపోతే మా సిబిల్ స్కోర్ పతనమవుతుంది. దేశంలో ఎక్కడా లోన్ దొరకని పరిస్దితి ఉంటుంది. అందుకే తల తాకట్టు పెట్టైనా ఈ ఎమ్ ఐ కట్టాల్సిన దుస్దితి మాది అంటున్నారు హైడ్రా కూల్చివేతల బాధితులు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Embed widget