Hyderabad: మాదాపూర్‌లో నడి రోడ్డుపైనే డబ్బు కట్టలు.. అన్నీ 2 వేల నోట్లే.. ఎగబడి తీసుకున్న జనం, అంతలోనే ఉసూరు
ఆ డబ్బులు తీసుకున్న వారు ఆ నోట్లను తదేకంగా చూడగా ఆ రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియాకు బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నడి రోడ్డుపై డబ్బుల కట్టలు కనిపించడం కలకలం రేపింది. పట్టపగలే ఈ ఘటనను చూసి అంతా అవాక్కయ్యారు. అంత డబ్బు రోడ్డుపైకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. అవన్నీ రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి వాటిని అందినకాడికి తీసుకుపోయేందుకు తెగ పోటీపడ్డారు. పలువురు వాహనదారులు చేతికందినంత డబ్బులు తీసేసుకున్నారు. అనంతరం వాటిని పరిశీలిస్తే, అవి ఫేక్ కాగితాలుగా తేలాయి. దీంతో అంతా ఉసూరుమన్నారు. డబ్బులు దొరికాయనే వారి ఉత్సాహం ఎక్కువ సేపు నిలవకుండా పోయింది.
కాగా, ఈ నోట్లను నిజమైనవిగా భావించి వాటిని దక్కించుకునేందుకు.. స్థానికులు, వాహనదారులు ఎగబడగా.. ఆ రోడ్డుపై ట్రాఫిక్ మొత్తం భారీగా నిలిచిపోయింది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, పిల్లలు ఆడుకునేందుకు ఆ నోట్స్ వినియోగిస్తున్నారని విచారణలో తేలింది.
Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?
Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?
ఆ డబ్బులు తీసుకున్న వారు ఆ నోట్లను తదేకంగా చూడగా ఆ రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియాకు బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. దీంతో నోట్లు తీసుకెళ్లినవారంతా ఉసూరుమన్నారు. పండక్కి తమ పంట పండిందని.. అనుకుని ఆ నోట్లను ఎత్తుకున్న వారందరూ అసలు విషయం తెలిసి.. వాటిని అక్కడే పడేని నిరాశతో ఇళ్ల బాట పట్టారు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
Also Read: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి
Also Read: ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలు ఇవే
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు