By: ABP Desam | Updated at : 12 Jan 2022 06:16 PM (IST)
బదిలీల జీవో కారణంగా పోయిన ఉద్యోగాలు - న్యాయం చేయాలంటున్న బాధితులు
నిజామాబాద్ జిల్లాలో ఆర్టికల్ 317 జీవో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన పంచాయతీరాజ్ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. 317 జోవో వల్ల జరనల్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా జోన్ 6 నుంచి రెగ్యూలర్ ఉద్యోగులు నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా ఉన్న 70 మందికి ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు ఉద్వాసన పలికారు. వీరిని 2020 జూన్ 10న మెరిట్ ద్వారా ఎంపిక చేశారు. ఏడాదిన్నరగా జిల్లాలో పని చేస్తున్న తమని అకారణంగా తొలగించారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న తమను తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కు వచ్చిన ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు.. మానవతా కోణంలో ఆలోచించి తమను కొనసాగించాలని.. లేదా ఇతర రూపంలోనైనా తమ సేవలు ఉపయోగించుకోవాలంటూ కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రo అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 మంది ఉద్యోగులను తొలగించడంతో... రోడ్డున పడ్డామని వాపోయారు. అయితే ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రస్తుతం తొలగించిన వారితో నియమితులైన 30 మందికి జేపీఎస్ ద్వారా రెగ్యులర్ చేశారు. వీరిని కూడా రెగ్యులర్ చేస్తారన్న నమ్మకంతో ఇతర ఉద్యోగాలను సైతం కాదనుకుని పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా కొనసాగితే తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పెంచిన ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన.. కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక !
ఈ విషయంపై పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చామని తొలగించిన ఉద్యోగులు చెబుతున్నారు. తాము ఎంతో కష్టపడ్డామని కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొన్నాం. ఇలా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకు్ండా ఉన్నఫలంగా తొలగించటమేంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
తమను నమ్ముకున్న కుటుంబాలు రొడ్డున పడ్డామని చెబుతున్నారు బాధితులు. తమతో పాటే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్ గా జాయిన్ అయిన 30 మందికి జేపీఎస్ ద్వారా రెగ్యూలర్ చేశారు. వారికి రూ.29,700 జీతం చెల్లించేవారు. తమకు కేవలం రూ.15000 వేలు చెల్లించేవారు. అయినా ఏప్పటికైనా తమను కూడా రెగ్యూలర్ చేస్తారని తక్కువ జీతానికైనా పని చేశాం. వేరే ఉద్యోగాలను వదిలి పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా చేరితే తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నయ మార్గం చూపించాలని వేడుకుంటున్నారు . ప్రభుత్వం వైపు నుంచి వీరికి ఇంత వరకూ ఎలాంటి భరోసా లభించలేదు.
Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి
Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
తెలంగాణ సీఎంపై కాంగ్రెస్ క్లారిటీ- శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంపైనే కసరత్తు !
Congress On Telangana New CM: తెలంగాణ సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిన డీకే శివకుమార్- ఖర్గే నివాసంలో కీలక భేటీ
Telangana CM News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా? భట్టి విక్రమార్కా? ఖర్గే నివాసంలో కాంగ్రెస్ పెద్దల మంతనాలు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>