Hyderabad: పెట్రోల్ ధరలతో భయమొద్దు.. రూ.100 చెల్లించండి రోజంతా తిరగండి.. సజ్జనార్ ప్రకటన
రూ.100కే ఒక రోజు ప్రత్యేక పాస్ జారీ చేస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా ప్రయాణించవచ్చని వివరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో తరచూ వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మంచి ఆఫర్ ఇచ్చింది. టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) పేరుతో రూ.100కే ఒక రోజు ప్రత్యేక పాస్ జారీ చేస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ బస్సులు, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని వివరించారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్నారని, ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు.
పాన్‌లు, గుట్కాలు తినడం నిషేధం
ఆర్టీసీ బస్సులోకానీ, బస్ స్టేషన్ పరిధుల్లో కానీ, గుట్కా, పాన్, ఖైనీ, పాన్ మసాలా లాంటివి తినడం నిషేధమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు మంగళవారం ఆయన ఆదేశాలు జారీచేశారు. కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్, గుట్కా, పాన్ మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైనది కాదని, ఇది చదువుకున్నవారు, సంస్కారవంతులు చేసే పనికాదని పేర్కొన్నారు. ఆ పని అనాగరికమని అన్నారు.
Also Read: Weather Updates: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
#TSRTC సిబ్బంది కి మరియు ప్రయాణికులకు అతి ముఖ్యమైన హెచ్చరిక తూచా తప్పకుండా పాటించండి లేనిచో జరిమానా విధించబడును.@puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @airnews_hyd @DDYadagiri @ntdailyonline @NTVJustIn @TV9Telugu @SakshiHDTV @hmtvnewslive @V6News @pandiribhargavi #SwachhBharat pic.twitter.com/2TY4n0aGrv
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 2, 2021
అధిక ధరలకు అమ్మితే చర్యలు
మరోవైపు, బస్టాండ్లలోని స్టాళ్లలో వస్తువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్టాండ్లలోని కొందరు షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మినట్లు ఫిర్యాదులు వస్తున్నవేళ ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అధికంగా డబ్బు వసూలు చేసిన షాపుల వారికి, నకిలీ బ్రాండ్ల వస్తువులు అమ్ముతున్న వారికీ అధిక మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు ఒప్పందం రద్దు చేస్తామని ఎండీ సజ్జనార్ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీచేశారు.
Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి