News
News
వీడియోలు ఆటలు
X

దూకుడు పెంచిన TSRTC - త్వరలో 550 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రయ్ రయ్!

ఆర్టీసి త్వరలో ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెలలో ఈ బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

FOLLOW US: 
Share:

TSRTC 550 summer electrical AC buses: తెలంగాణ ఆర్టీసి త్వరలో ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెలలో ఈ బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి  విజయవాడ మార్గంలో మొదటిసారి 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి రాబోతునట్లు తాజాగా TSRTC ప్రకటించింది.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ ఎలక్ట్రికల్  బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు ఆస్టీసీ ఎండి సజ్జనార్. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్త ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలేంటి..?
12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్ కు అనుసంధానం చేస్తున్నారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ బస్సులో సిసి కెమెరా బ్యాకప్ ఓ నెలరోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో బస్సులోపల ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు.

బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగే అవకాశం ఉంటే వెంటనే గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఈ  (FDSS)ఉపయోగపడుతుంది. బస్సు చేరుకునే స్టాఫ్‌ వివరాలను ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఈ ఎలక్ట్రికల్ ఏసి బస్సుల్లో ఏర్పాటు చేశారు.

నిత్యం వాహనాల పొగతో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనున్నారు. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా  ఆయా సంస్థలు ఈ బస్సులను సాధ్యమైనంత వేగంగా తయారు చేసి టీఎస్‌ఆర్టీసీకి అందజేయనున్నాయి.

Published at : 17 Apr 2023 10:42 PM (IST) Tags: RTC Telangana News AC Buses TSRTC Sajjanar

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?