By: ABP Desam | Updated at : 24 Mar 2023 11:02 AM (IST)
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. నిరుద్యోగ మహా దీక్ష పేరుతో ర్యాలీకి ప్లాన్ చేశారు. గన్ పార్క్ నుంచి ఉస్మానియా వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో మహాగర్జన చేపట్టున్నారు. దీనికి వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొందరు నాయకులు సంఘీభావం తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ కూడా విద్యార్థుల దీక్షలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకులపై ఉస్మానియాలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రేవంత్ మద్దతు ప్రకటించారు. వాళ్ల ఆహ్వానం మేరకు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రేవంత్‌ను హౌస్ అరెస్టు చేసింది. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకున్నా సరే ఎంతమందిని పోలీసులను పెట్టినా తాను మాత్రం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి వెళ్తానంటున్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మహాదీక్షకు విద్యార్థులు రేవంత్‌ను ఆహ్వానించారు. ఓయూ జేఏసీ కోరిక మేరకు ఆయన వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే ఆయన్ని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసేసి నిర్బంధించారు.
ప్రవీణ్ పెన్ డ్రైవ్ ప్రేమకథ - పేపర్ లీక్ పై RSP విశ్లేషణ
TSPSC పేపర్ లీకేజ్ పై RS ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలోని ఎన్‌ఆర్‌హెచ్ హాస్టల్‌లో విద్యార్థులతో ఆర్‌ఎస్పీ మాట్లాడారు. చాయ్ తాగుతూ విద్యార్థుల ఆవేదనలు తెలుసుకున్నారు. గ్రూప్-1 ఒక్కటే కాదు... గతంలో TSPSC నిర్వహించిన చాలా పేపర్లు లీకైనట్లు BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనలు, ఆవేదనలు విన్న ప్రవీణ్ కుమార్... అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!
TS Group-1: రేపే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !