హైదరాబాద్‌లో తక్కువ దూరం ప్రయాణించే వారికి గుడ్ న్యూస్- తొలిసారిగా రూట్ పాస్ తీసుకొచ్చిన ఆర్టీసీ
టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ఈ రూట్‌పాస్‌లో కల్పించబోతోంది టీఎస్‌ఆర్టీసీ. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ రూపకల్పన చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తొలిససారిగా జనరల్ రూట్ పాస్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ ఫెసిలిటీ 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ఈ రూట్‌పాస్‌లో కల్పించబోతోంది టీఎస్‌ఆర్టీసీ. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించేలా దీన్ని డిజైన్ చేశారు.
ఈ రూట్ పాస్ కూడా నెల రోజులకు తీసుకోవాల్సి ఉంటుంది. సిటీ ఆర్డినరీ రూట్ బస్ పాస్ కోసం 600 రూపాయలు వసూలు చేయనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ రూట్ పాస్ తీసుకోవాలంటే వెయ్యిరూపాయలు చెల్లించాలి. వీటితోపాటు ఐడీ కార్డు కోసం అదనంగా యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ రూట్ పాస్‌ను మొదటగా హైదరాబాద్‌లోని 162 రూట్లలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ రూట్ పాస్ తీసుకున్న రూట్‌లలో 8 కిలోమీటర్ల పరిధిలో ఎన్నిసార్లైనా తిరగవచ్చు. సెలవు దినాల్లో కూడా ఈ పాస్‌మీద ట్రావెల్ చేయవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు #TSRTC శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 25, 2023
హైదరాబాద్‌లో ప్రయాణికులకు జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు 1150 రూపాయలు, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు 1300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ తీసుకన్న వాళ్లు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు.
సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ జనరల్ బస్ పాస్ కొనుగోలు చేస్తున్నారు. అందుకే షార్ట్ డిస్టెన్స్ వాళ్ల కోసం రూట్ పాస్ తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ. ఇలా తక్కువ దూరం ప్రయాణించే వాళ్లంతా ఆర్టీసీ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అందుకే వారిని ఆకర్షించేందుకు రూట్ పాస్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది ఆర్టీసి.
జనరల్ బస్ పాస్ లు ఎక్కువ విద్యార్థులే కొంటున్నారు. సాధారణ ప్రయాణికులను కూడా ఆర్టీసీ ఎక్కించేలా ప్రయత్నాల్లో భాగంగా ఈ రూట్ పాస్ తీసుకొచ్చింది. మొదటిసారిగా ఈ పాస్ తీసుకున్న వారికి రాయితీని కూడా ఇస్తున్నారు. 200 రూపాయలు తగ్గించి సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ 600లకి, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ 1000కే ఇస్తున్నారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ, 80 రూపాయలతో హైదరాబాద్ చుట్టి రావచ్చు!
Also Read: హైదరాబాద్‌లో తిరగాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్!
కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రయాణికులకు #TSRTC అందుబాటులోకి తెచ్చింది. #Hyderabad లోని మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద 10 కొత్త బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఒలెక్ట్రా సీఎండీ ప్రదీప్ తో కలిసి ఇవాళ… pic.twitter.com/dIUhpGoRFO
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 16, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

