(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao: ఎన్ని కుట్రలు చేసినా అనుకున్న సమయానికి మల్లన్న సాగర్ పూర్తి: హరీశ్ రావు
కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్ రావు చెప్పారు.
TS Minister Harish Rao at Komuravelli Mallanna Temple: కుట్రలు చేసినా అనుకున్న సమయానికి మల్లన్న సాగర్ పూర్తి: హరీశ్ రావు కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు కేటాయించారని, ఇప్పటికే ఆయన మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామని చెప్పారు. కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు.
కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు
‘రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారు. వచ్చే యేటా మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తాం. కొమురవెళ్లి మల్లన్న కల్యాణం కోసం అశేష జన వాహిని సమక్షంలో హాజరుకావడం చాలా సంతోషం. రూ.1100 కోట్ల రూపాయలతో యాదాద్రి నిర్మాణం జరగడం సంతోషకరం’ అన్నారు.
Speaking at Sri Komuravelli Mallikarjuna Swamy Kalyana Mahotsavam https://t.co/p84ICZUR7t
— Harish Rao Thanneeru (@trsharish) December 18, 2022
కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి
కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించాం అన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లన్నకు కిలోన్నర స్వర్ణ కిరీటం చేయించడం సంతోషం కలిగించిందన్నారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామని చెప్పారు. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ (Telangana CM KCR) కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలు సాగునీటితో సస్యశ్యామలం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నాం అన్నారు. రూ.11కోట్ల రూపాయలతో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
Also Read: సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్‌ను సేవ్ చేద్దామనుకుంటున్నారా? అసలుకే ముంచేద్దామనుకుంటున్నారా ?