తెలంగాణలో నేటి నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR ప్రక్రియ) ప్రారంభమైంది. భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఇందులో పాల్గొనడం తప్పనిసరి.
SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
SIR In Telangana: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఇది జులై 24వరకు కొనసాగుతుంది.

- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేటినుంచి ప్రారంభం.
- నెలరోజులపాటు 36వేల మంది BLOలు ఇంటింటి సర్వే చేపడతారు.
- ఓటర్లు తమ వివరాలు ఆన్‌లైన్‌లోనూ సరిచూసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు.
- వివరాలు లేకుంటే ఓటు హక్కు కోల్పోవచ్చు, హెల్ప్‌లైన్ 1950.
SIR In Telangana: తెలంగాణ నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision) ప్రారంభమైంది. భవిష్యత్‌లో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే కచ్చితంగా SIR ప్రక్రియలో పాల్గొనాల్సిందే. అధికారులు అడిగిన పత్రాలు చూపించి మీ ఓటు హక్కును నిర్దారించుకోండి. వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయినా, సరైన పత్రాలు చూపించలేకపోయినా మీ ఓటు ప్రమాదంలో పడుతుంది. అందుకే BLOలో మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా వారు అడిగిన వివరాలు అందజేయడం మంచిదని అధికారుల సూచిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 3,38, 26, 228 మంది ఓటర్ల డేటాను వడపోసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కేవలంం ఓటు ఉండటమే కాదు, అందులో మీ ఫొటో పేరు, అడ్రస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదే చెక్ చేసుకోవడానికి ఇదే సరైన టైం. ఒక వేళ ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఓటు వేచే ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే బీఎల్‌వోలు అడిగే వివరాలను సిద్ధం చేసుకోండి.
జులై 24 వరకు మెగా సర్వే
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నేటి నుంచి జులై 24 వరకు అంటే నెల రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింట సర్వే నిర్వహిస్తారు. ఈ యజ్ఞంలో దాదాపు 36వేల మంది BLOలు పాల్గొంటున్నారు. ప్రతి బీఎల్‌వో తన బూత్ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారు. ఆ బీఎల్‌వోలు ప్రతి ఇంటినీ మూడు సార్లు విజిట్ చేస్తారు. హైదరాబాద్ పరిధిలో పత్రాలు ఇంగ్లీష్‌లో ఉంటాయని, మిగిలిన అన్ని జిల్లాల్లో తెలుగులో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మీరు పూర్తి చేసిన రెండు పత్రాల్లో ఒకదాని బీఎల్‌వో తీసుకుంటారు. రెండోదాన్ని రసీదుగా మీకే ఇస్తారు. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్
మీరు ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటే BLO కోసం ఇంట్లో ఎదురు చూసే పరిస్థితి లేకుంటే, మీ కోసం ఎన్నికల సంఘం స్మార్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది. http://voters.eci.gov.in అనే అధికారి పోర్టల్‌లోకి వెళ్లి మీరు ఆన్‌లైనలోనే వివరాలను పూర్తి చేయవచ్చు. మీ మొబైల్ నెంబర్, ఎపిక్ కార్డు నెంబ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. మీ ఓటరు జాబితా వివరాలు, ఆధార్ కార్డులోని పేరు సరిపోలితేనే ఈ డిజిటల్ సౌకర్యం వర్తిస్తుంది. ప్రతిదీ మీ మొబైల్‌లోనే ఫినిష్ చేసే ఈ టెక్ సావీ పద్ధతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోండి.
మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ అంటే ఏంటీ?
చాలా మంది ఓటర్లకు వచ్చే పెద్ద సందేహం ఇదే. బీఎల్‌వోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటు మ్యాపింగ్ అయిందా లేదా అన్ మ్యాపింగ్ అయిందా అనే వివరాలు వారి వద్ద ఉంటాయి. ఒక వేళ వివరాలు తప్పుగా ఉంటే లేదా మీరు ఇల్లు మారితే ఎలా నింపాలో బీఎల్‌వోలు మీకు చెబుతారు. ఒకవేళ మీ వద్దకు బీఎల్‌వో రాకపోయినా, లేదా ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్ చేయండి. మీ పరిష్కారం లభిస్తుంది.
Frequently Asked Questions
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎప్పుడు ప్రారంభమైంది?
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనడం ఎందుకు ముఖ్యం?
మీ పేరు, చిరునామా, ఫోటో సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఇది సరైన సమయం. ఈ అవకాశాన్ని కోల్పోతే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
ఓటర్ల జాబితా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చా?
అవును, http://voters.eci.gov.in పోర్టల్‌లో మొబైల్ నంబర్, EPIC నంబర్‌తో లాగిన్ అయి వివరాలను పూర్తి చేయవచ్చు. మీ ఓటరు వివరాలు ఆధార్‌తో సరిపోలితేనే ఈ సేవ వర్తిస్తుంది.
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ సర్వే ఎంతకాలం జరుగుతుంది?
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి నుంచి జులై 24 వరకు, అంటే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. 36 వేల మంది బీఎల్‌వోలు ఇందులో పాల్గొంటారు.
బీఎల్ఓలు ఇంటికి రాకపోయినా, సందేహాలు ఉన్నా ఎవరిని సంప్రదించాలి?
ఒకవేళ మీ వద్దకు బీఎల్ఓ రాకపోయినా, లేదా ఏదైనా డౌట్ ఉన్నా, వెంటనే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు






















