అన్వేషించండి

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే

Telangana: 15 ఏళ్లు దాటిన కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు కొత్త పాలసీని తీసుకొస్తోంది. జనవరి 1, 2025 నుంచి ఈ కొత్త పాలసీ అమలుకానుంది.

Telangana New Vehicle Scrap Policy: తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025,  జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు....అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే... ఆ వాహనాలకు ఇకపై రిజిస్ట్రేషన్ చేయరు. రోడ్లపై తిరిగేందుకు ఆ వాహనాలకు అనుమతి ఉండదు. వెహికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయితే... గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించి... మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయిన  వాహనాలు మాత్రం స్ర్కాప్‌కే. అలా కాదని... ఆ వాహనాలను రోడ్డెక్కిస్తే... అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

తెలంగాణలో ప్రస్తుతం 15ఏళ్లు పైబడిన వాహనాలు 30లక్షలకుపైగా ఉన్నాయి. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 20లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 లక్షలు బైక్‌లు కాగా.. మూడున్నర లక్షల కార్లు, లక్ష గూడ్స్‌ క్యారేజీలు, 20వేల  ఆటో రిక్షాలు ఉన్నాయి. రవాణా శాఖ ఇప్పటికే స్క్రాపేజ్‌ విధానానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి... ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడంలేదు.  అయితే..  కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు అనే రాష్ట్రాలు తెలంగాణ తరహాలోనే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

స్క్రాపింగ్‌ను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీ..
దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు స్ర్కాప్‌కు వెళ్లాల్సిన కేటగరిలో ఉన్నాయి. అంతేకాదు... దాదాపు 2వేల స్కూల్‌ బస్సులు కూడా 15ఏళ్లు పైబడినవే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం పాత వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీని  పరిశీలిస్తోంది. పాత వాహనాలు తక్కుకు ఇచ్చేసి.. కొత్త వాహనాలను కొనుగోలు చేసే క్రమంలో... మోటారు వాహనాల పన్నుపై 10 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీని అందించాలని కూడా భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ప్రభుత్వం ముందు ముసాయిదా ప్రతిపాదన...
స్క్రాపేజ్‌ విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే సమర్పించామని... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని అంటోంది రవాణా శాఖ. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత... ఈ విధానం అమల్లోకి వస్తుందని. వాహన  స్క్రాపింగ్ ప్రారంభమవుతుందని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు చెప్తున్నారు. వాహనాల స్క్రాపింగ్‌ కోసం ఇప్పటికే మూడు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. కాలుష్య కారకమైన వాహనాలను, రోడ్డుపై నడిపేందుకు అర్హత లేని వాహనాలను  తొలగించడమే తమ లక్ష్యమని అంటున్నారు ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు.

Also Read: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!

15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాల సంగతేంటి..?
ప్రభుత్వ శాఖలోని 15ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున వాహనాలకు సంబంధించి RTA శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆటో, మోటర్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్‌ చేస్తోంది. జీహెచ్‌ఎంసీ (GHMC)లో ఆటో టిప్పర్లు,  అంబులెన్సులు, ఫైరింజన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలు పొగను వెదజల్లుతూ రోడ్లపై తిరుగుతున్నాయి. 15ఏళ్ల దాటిన ప్రైవేట్‌ వాహనాలను రద్దు చేసినట్టే... ప్రభుత్వ వాహనాలను కూడా స్ర్కాప్‌కు పంపాలని కోరుతున్నారు.

కాలంచెల్లిన వాహనాలతో ప్రమాదాలు
15ఏళ్లు దాటిన వాహనాలతో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్తోంది.  2022లో... 15 ఏళ్లు దాటిన వాహనాల వల్ల... రాష్ట్రంలో 1306 ప్రమాదాలు జరిగాయని తెలిపింది. ఆ ప్రమాదాల్లో 418 మంది  మరణించగా... 1100 మందికిపైగా గాయపడ్డారని నివేదిక ఇచ్చింది. 

కాలంచెల్లిన వాహనాలతో ఇబ్బందులు
పాత ఆటోమొబైల్స్‌.. ముఖ్యంగా 15ఏళ్లు పైబడిన వాహనాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయని రోడ్‌ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. బ్రేక్‌ ఫెయిలవడం వంటివి ఎక్కువగా జరుగుతాయంటున్నారు. అంతేకాదు క్లచ్‌లు కూడా గట్టిగా  మారతాయి, గేర్లు మార్చడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు... వాహనం ఆగిపోతుంది. లేదా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక... వీలైనంత వరకు కాలం చెల్లిన వాహనాలు నడకపకపోవడమే  ఉత్తమం అంటున్నారు రోడ్‌ సేఫ్టీ నిపుణులు.

Also Read: సెల్ ఫోన్లు తీసుకురావద్దు- టీచర్స్‌కి విద్యాశాఖాధికారుల ఆదేశం

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget