అన్వేషించండి

TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బుధవారం గాంధీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారానికి ఇద్దరు మంత్రులు, నెలకోసారి సీఎం రావాలని చెప్పారు.

Telangana News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారంతా ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్‌కు రావాలని నిర్దేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను, మంత్రులు రావాల్సిన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేస్తూ ప్లాన్ రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్కో మంత్రి గాంధీ భవన్‌కు రావాలని మహేష్ సూచించారు. వచ్చే శుక్రవారం నుంచి గాంధీ భవన్‌కు మంత్రుల రాక ప్రారంభం అవుతుందని అంటున్నారు.

అయితే, బాధ్యతల స్వీకరణ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్షుడిని అయినా కూడా సామాన్య కార్యకర్త తరహాలోనే ఉంటాననని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు. వారిలో ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి అని అన్నారు.

తనకు గాంధీ భవన్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తాను పీసీపీ చీఫ్‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. అలాగే తనకు ఇన్నీ రోజులు పదవి ఎందుకు రాలేదని ఎప్పుడు అనుకోలేదని అన్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా అందుకే తనకు వచ్చిందని చెప్పారు. ‘‘గాంధీ భవన్‌లో ఎలాంటి పవర్ సెంటర్లు లేవు. ఒక్కటే సెంటర్ పవర్ రాహుల్ గాంధీ. ప్రతి రోజు నేను గాంధీ భవన్‌లో 6 గంటలు ఉంటాను. ప్రతి వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాల్సి ఉంటుంది. బుధవారం ఒకరు.. శుక్రవారం మరో మంత్రి అందుబాటులో ఉండాలి. నెలకు ఒకసారి సీఎం కూడా గాంధీ భవన్‌కు రావాల్సి ఉంటుంది’’ అని మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.

మహేశ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దీపాదాస్‌ మున్షీతో పాటుగా ఇతర కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. 

అనంతరం వరంగల్ పర్యటనకు
ఈ కార్యక్రమం అనంతరం మొట్టమొదటిసారి వరంగల్ జిల్లా పర్యటనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. ఆయనకు ఓరుగల్లు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Tripti Dimri : ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Embed widget