అన్వేషించండి

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

స్వరాష్ట్ర పాలనలో సాధించి విజయాలు, ప్రగతిని వివరిస్తూ 21 రోజుల పాటు సంబురాలు చేయబోతోంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు శ్రీకారం చుట్టనున్నారు.

దశాబ్దాల కల  నిజమైన రోజు. ఉద్యోగాల సాధనతో మొదలై స్వపరిపాలన కోసం సాగింది తెలంగాణ ఉద్యమం. ఎందరో అమరుల త్యాగల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించి నేటికి 9 ఏళ్లు పూర్తై 10వ ఏటలోకి అడుగుపెడుతున్న తరుణం. ఈ మహత్తర ఘట్టాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం 

స్వరాష్ట్ర పాలనలో సాధించి విజయాలు, ప్రగతిని వివరిస్తూ 21 రోజుల పాటు సంబురాలు చేయబోతోంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, విద్య, పరిశ్రమల అన్నింటి సాగిస్తున్న ప్రగతిని ప్రజలకు తెలియజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 22వ తేదీ వరకు జరగనున్నాయి. 

కొత్తగా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్ దశాబ్ధి వేడుకలు ప్రారంభిస్తారు. ఉదయం పదిన్నరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబురాలకు శ్రీకారం చుడతారు. తర్వాత తెలంగాణ అమరవీరుపలకు నివాళి అర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు.

జూన్‌ 3: తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

జూన్‌ 4: పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. 

జూన్‌ 5: తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు.

జూన్‌ 6: తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. 

జూన్‌ 7: సాగునీటి దినోత్సవం నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ సభలు ఉంటాయి. రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

జూన్‌ 8: ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు.

జూన్‌ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తారు.

జూన్‌ 10: తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు- చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.

జూన్‌ 11: తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటు-ంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీ-లు నిర్వహించి, బహుమతులందజేస్తారు.

జూన్‌ 12: తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

జూన్‌ 13: తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటు-న్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు.

జూన్‌ 14: తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు.

జూన్‌ 15: తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం జరుపుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే కార్యక్రమాలుంటాయి.

జూన్‌ 16: తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీ-లు, పట్టణాలు సాధించిన ప్రగతిని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.

జూన్‌ 17: తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.

జూన్‌ 18: తెలంగాణ మంచి నీళ్ల పండుగ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 19: సోమవారం తెలంగాణ హరితోత్సవం ఉంటు-ంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.

జూన్‌ 20: తెలంగాణ విద్యాదినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ లను ప్రారంభిస్తారు.

జూన్‌ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలుంటాయి.

జూన్‌ 22: అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget