Russia Ukraine Conflict: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో వీరికి ఫ్రీ, రాష్ట్రంలో ఎక్కడికైనా - ఆఫర్ ప్రకటించిన సజ్జనార్
Ukraine News: ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని వారి స్వగ్రామానికి లేదా ప్రాంతానికి వెళ్ళే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.
TSRTC Latest News: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం (Russia Ukraine War) కొనసాగుతోంది. అక్కడ వేలాది మంది భారతీయులు, వందలాది మంది తెలుగువారు చిక్కుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్‌కు చెందిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక విమానాల ద్వారా వారిని విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తూ ఉంది. ఇక ఉక్రెయిన్ లో (Ukraine) చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు కూడా విడతల వారీగా హైదరాబాద్ (Hyderabad) చేరుకుంటున్నారు. వారు తొలుత ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీసులో దొంగతనం, పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌పై కేసు - ఏం చోరీ జరిగిందంటే
ఫ్రీగా ప్రయాణించే అవకాశం
అయితే, వారి కోసం తెలంగాణ ఆర్టీసీ తన వంతుగా సహకరిస్తూ ఉంది. శంషాబాద్ విమానాశ్రయం (RGIA) నుంచి రాష్ట్రంలోని వారి స్వగ్రామానికి లేదా ప్రాంతానికి వెళ్ళడానికి తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కీలక ప్రకటన చేసింది. విమానాశ్రయం నుంచి తెలంగాణలో సొంతూరికి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ట్విటర్ ద్వారా ప్రకటించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి (Hyderabad Airport) చేరుకున్న వారు బస్సుల్లో ఎలాంటి టికెట్లు తీసుకోకుండానే సొంతూరికి ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
Also Read: Khammam: కొన్నేళ్లుగా ఏటా తగలబడుతున్న గడ్డివాము, సీసీ కెమెరాల ఏర్పాటు - అసలు విషయం తెలిసి అవాక్కు!
మానవతా దృక్పతాన్ని చాటుకున్న టీఎస్ఆర్టీసీ (TSRTC)
ఉక్రెయిన్ (Ukraine Crisis) నుంచి ఢిల్లీ, ముంబయి నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా ఉచితంగా తీసుకొస్తోంది. అక్కడి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) కూడా వారికి ఉచిత ప్రయాణ వసతి కల్పించింది. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులు సొంతూర్లకు క్షేమంగా చేరుకునే వరకు ఈ వెసులుబాటుక ఉంటుందని వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను ట్వీట్ చేశారు.
#Ukraine నుండి ఇండియా కు తిరిగివస్తున్న విద్యార్థులకు #Hyderabad లోని @RGIAHyd రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి #Telangana లో ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణించడానికి #TSRTCBuses నీ ఏర్పాటు చేశాం #TSRTCPublicService @TSRTCHQ @DrTamilisaiGuv @TelanganaCMO @KTRTRS @puvvada_ajay @BDUTT pic.twitter.com/H2y9BlCIQ1
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022