అన్వేషించండి

Revanth Reddy : 4 కోట్ల మంది ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు, దావోస్ లో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy In Davos: తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే నా లక్ష్యంమన్నారు.

Davos Investments : తెలంగాణ (Telangana) ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు (Digital Health Cards) అందజేస్తామని (Cm Revanth Reddy ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే నా లక్ష్యంమన్న ఆయన, డిజిటల్‌ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని హామీ ఇచ్చారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ అంశంపై రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాణ్యమైన వైద్యసేవలు పొందడం ఖర్చుతో కూడుకున్న విషయమన్న ఆయన, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అన్న రేవంత్ రెడ్డి...ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామని, ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

7 వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు 
మరోవైపు దాదాపు 37 వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై పదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు గౌతం అదానీ అంగీకరించారు. అంబుజా సిమెంట్స్ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1400 కోట్ల రూపాయలతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ను నెలకొల్పనుంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. అదానీ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. 

జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడులు 9 వేల కోట్లు
మరో పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 9 వేల కోట్ల రూపాయలతో పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్లలో 8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంగీకారం తెలిపింది. దీని ద్వారా  6వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. లిథియం, సోడియం బ్యాటరీలను తయారు చేయనుంది గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. రాష్ట్రంలో గంటకు 12.5 గిగా వాట్ల సామర్థ్యంతో సెల్‌లు తయారీ సంస్థను నెలకొల్పనుంది. 

12వందల కోట్లతో వెబ్ వెర్క్స్ డేటా సెంటర్
రాష్ట్రంలో ఇప్పటికే 12వందల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న వెబ్ వెర్క్స్ సంస్థ...మరో 4వేల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2 వేల కోట్ల రూపాయలతో మల్లాపూర్‌లోని పరిశ్రమ విస్తరించాలని ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ నిర్ణయించింది. 1500 మందికి ఉపాధి లభించనుంది.  టాటా సన్స్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, హెయినెకెన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

Also Read: తెలంగాణలో భారీ పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి, రూ.వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్

Also Read:  పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల, కుమారుడి వివాహానికి ఆహ్వానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget