Teenmar Mallanna: కొత్త రూట్‌లో తీన్మార్ మల్లన్న! కేసీఆర్ గురించి అలా అన్నారేంటి?
Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు.
Teenmar Mallanna Comments on CM KCR: క్యూ న్యూస్ (Q News) మీడియా వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) రోజూ ఉదయం తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం వినిపించే సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) తీవ్ర స్థాయిలో, ఘాటుగా తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. అలాంటి మల్లన్న తాజాగా చేసిన ఓ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై తాను కేసీఆర్‌ను తిట్టబోనని అన్నారు. ఇలా ఆయన తన పంథాకు విరుద్ధంగా కొత్త శపథం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
‘‘ఒట్టేసి చెప్తున్నా.. ఇక నుంచి నేను సీఎం కేసీఆర్ (CM KCR)ను నేను తిట్టను. ఇకపై 7200 మూవ్ మెంట్ ప్రజల్లో చైతన్యం కోసమే కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా (Siddipet) గజ్వేల్‌లో (Gajwel) గురువారం ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) హాజరై మాట్లాడారు.
ఇటీవలే బీజేపీ ఆఫీస్‌లో అడుగు పెట్టానని.. త్వరలో కొత్త పార్టీ పెడతానని తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని అన్నారు. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పేద వారు, పేద బిడ్డలు ఒకే పాఠశాల వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ పోరాట లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ప్రజల్లో చైతన్యం కోసమే తమ పోరాటమని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల పైన విమర్శలు చేస్తూ ఉండడం తన విధానం కాదని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు.
విద్యాశాఖ వారికి ఇవ్వాలి
రాష్ట్రంలో బాల్క సుమన్ (Balka Suman), గ్యాదరి కిషోర్ (Gadari Kishore) వంటి వారికి విద్యాశాఖను అప్పగిస్తే బావుంటుందని అన్నారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రమంతటా రైతులు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి (CM KCR) మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడం లేదని విమర్శించారు. యాదాద్రిలో రూ.వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలి వానకే తేలిపోయిందని గుర్తు చేశారు. తన ఆస్తులన్నిటినీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ రెండో వారంలో చేపట్టే ప్రజా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ రజనీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: హీటెక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్ - TRS నేతలకు, కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్