By: ABP Desam | Updated at : 06 May 2022 11:07 AM (IST)
రేవంత్ రెడ్డి, కవిత
TPCC Chief Revanth Reddy Strong Counter to MLC Kavitha: Rahul Telangana Tour: ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేశారు. రాహుల్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్లు, ఆరోపణలు చేశారు. నేడు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న తరుణంలో తెలంగాణ కోసం మీరు ఏం చేశారంటూ నేటి ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (TRS MLC Kavitha) కొన్ని ప్రశ్నలు సంధించగా.. ‘చూసుకొని మురవాలి...చెప్పుకొని ఏడ్వాలి...’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. కవితను ట్యాగ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి.
‘కవితగారూ.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. ?
మీ నాన్న కేసీఆర్, ప్రధాని మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?
వరి వేస్తే ఉరేనని మీ నాన్న ప్రవచనాలు చెప్పిన ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ?
చూసుకొని మురవాలి...చెప్పుకొని ఏడ్వాలి...@RaoKavitha pic.twitter.com/z7TFkid7FX
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022
రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మీ తండ్రి పచ్చి మోసానికి పాల్పడితే ప్రశ్నించాల్సిన మీరెక్కడ ఉన్నారు ?
రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని కేసీఆర్ చెప్పి ఐదేళ్లు అవుతున్నా, అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు. మరి మీరెక్కడ ఉన్నారు ?
అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాశులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు. వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు. ?
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రాష్ట్ర రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువకే అంటే రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలని’ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ప్రశ్నలు లేవనెత్తిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ తన ప్రశ్నలతో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Also Read: Rahul Gandhi Warangal Meeting: మీరు వరంగల్ వైపు వెళ్తున్నారా, అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
MLC Kavitha: కేరళ నుంచి మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు