AP CM Chandrababu: 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు- సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
2029 కి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

House for Poor People in Andhra Pradesh | చిన్నమండెం: ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలను సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండల దేవగుడిపల్లిల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని వర్చువల్‌గా చంద్రబాబు ప్రారంభించారు. రాయచోటి నియోజకవర్గానికి రెండోసారి వచ్చా, వీరి అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సెంథిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు.
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, పత్రాలు పంపిణీ..
దేవగుడిపల్లిల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇంటి పత్రాలు అందజేశారు. ఇళ్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, ఆ కుటుంబానికి గౌరవం అన్నారు. ఇల్లు అంటే సంతోషానికి చిరునామా, భవిష్యత్తు. మీ ఇంటి అడ్రస్ అని అడిగితే కొందరికి నామోషిగా ఉంటుంది. 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు వచ్చేలా చూస్తాం. పేదవాడికి పక్కా ఇల్లు అనేది 1984లో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వమే దేశంలో తొలిసారిగా పేదలకు పక్కా ఇల్లు నిర్మించలేదు. కేవలం గుడిసెలు వేసేవాళ్లు. ఆ గుడిసెలు గాలికి కొట్టుకుపోయేవి. నా పేదవాళ్లు పక్కా ఇంట్లో ఉండాలని ఈ పథకానికి ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం.
ఏపీ పరిస్థితి చూస్తే ఆశ్చర్యమేసింది..
మీరు డబ్బులు సంపాదించుకుంటే తరువాత మరో సొంతిల్లు కట్టుకోండి. నేను నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను. పరిపాలన నాకు కొత్తకాదు. కానీ రాష్ట్రాన్ని దారుణ స్థితికి తీసుకొచ్చారు. అప్పు ఇచ్చే పరిస్థితి లేకుండా నాశనం చేశారు. కేంద్రం ఇచ్చిన పథకాలతో స్కీములు రూపకల్పన చేస్తారు. కానీ కేంద్రం ఇంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకోకపోతే పేదలు నష్టపోతారు. మనేగ్రా లో నూటికి 90 శాతం కేంద్రం ఇస్తుంటే, రాష్ట్రం 10 శాతం ఇస్తుంది. రాష్ట్రం తన ఖర్చు చేయకపోతే కేంద్రం నిధులు వెనక్కి వెళ్తాయి.
ఉగాది రోజు మిగతా ఇండ్లు గృహప్రవేశం..
డ్రిప్ ఇరిగేషన్ పై చొరవ చూపించి సబ్సిడీ ఇవ్వడంతో రాయలసీమలో నేడు చాలాచోట్ల దీని ద్వారా సాగు చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా, ఇబ్బందులున్నా ఒకేరోజు పేదల 3 లక్షల 192 ఇల్లు గృహప్రవేశం చేశాం. పీఎంఏవై కింద 2 లక్షల 28 వేలు, మరో 68 వేలు మొత్తం కలిపి 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తిచేశాం. రాయచోటిలో 17 వేల 93 ఇల్లు మంజూరు చేస్తే 2 వేల ఇండ్లు పూర్తిచేశాం. మిగిలిన ఇండ్లు పూర్తిచేసి ఉగాది రోజు గృహప్రవేశం చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 43 వేల కోట్లు మంజూరు చేసి 16 వేల కోట్లు పేదలకోసం ఖర్చు చేశాం. వైసీపీ హయాంలో పేదల ఇండ్లు కూల్చివేశారు. 4.70 లక్షల ఇళ్లు రద్దు చేశారు. పేదలు ఇండ్లు కట్టుకుంటే 900 కోట్లు డబ్బులు ఎగ్గొట్టారు. మీరు ఇల్లు కట్టు మేం ఇస్తామని డబ్బులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ప్రజలు కట్టే పన్నులను వైసీపీ దోచుకున్నా రోడ్లు వేయలేదు, డ్రైనేజీ చేయలేదు, కరెంట్ కూడా లేకుండా చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇసుకను కూడా పందికొక్కుల్లా దోచుకున్నారంటూ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.






















