By: ABP Desam | Published : 09 Jan 2022 03:45 PM (IST)|Updated : 09 Jan 2022 03:45 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృభిస్తోంది. ఐటీ కంపెనీలు సహా ఇంటి నుంచి పని చేసుకొనే వీలున్న అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ఒక వేళ ఎవరైనా ఉద్యోగి కరోనా బారిన పడితే వారికి వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాయి. ఇలా కంపెనీలు కల్పించే సౌకర్యాలను అలుసుగా తీసుకొని కొందరు అక్రమంగా వాడుకొనే వారూ ఉన్నారు. దీన్ని దుర్వినియోగం చేస్తూ ఓ మహిళ అడ్డంగా బుక్కయింది.
కొంత మంది ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తుండటం పట్ల కంపెనీలు కూడా సీరియస్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కోవలోనే ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి అడ్డంగా బుక్కైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పేరున్న ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న ఓ మహిళ ఊరికే సెలవులు తీసుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్లాన్ వేసింది. కొవిడ్ సోకిన వారికి ఎలాంటి వేతనంలో కోత లేకుండా కంపెనీలు ఇస్తున్న సదుపాయాన్ని వాడుకోవాలని భావించింది. ఇందుకోసం తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి నకిలీ సర్టిఫికెట్‌ను పొందింది. దాన్ని వాళ్ల సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్ఆర్ విభాగానికి ఇచ్చి సెలవులు తీసుకుంది.
అయితే, హెచ్ఆర్‌లు ఆ సర్టిఫికెట్‌పై విచారణ చేపట్టారు. దీంతో అది నకిలీ సర్టిఫికేట్ అని తేలింది. ఈ విషయం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి చేరవేయడంతో ఆ ఉద్యోగిపై చర్యలు తీసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సాఫ్ట్‌వేర్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇప్పటికే చాలా మంది ఐటీ ఉద్యోగులు తమకు కోవిడ్ సోకినట్లు సర్టిఫికెట్లు సమర్పించి సెలవులు తీసుకోవడంతో అందులో ఎన్ని నిజమైనవి? ఎన్ని నకిలీవో తెలియక యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా ఇతర రంగాల్లోని ఉద్యోగులు చాలా మంది డయాగ్నోస్టిక్ సెంటర్లకు డబ్బులిచ్చి ఫేక్ కరోనా సర్టిఫికేట్లు పొందినట్లుగా తెలుస్తోంది.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
Petrol-Diesel Price, 16th May: వాహనదారులకు హ్యాపీ ! చాలా చోట్ల స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇక్కడ మాత్రం స్థిరం
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Boy Dies At Swimming Pool: నాగోల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి, ఓనర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?