అన్వేషించండి

SIT at KCR House: కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన, ప్రభుత్వంపై విమర్శలు

SIT Questions KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేతను ఆరుగురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇదివరకే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌ నుంచి హైదరాబాద్‌కు రాగా, నందినగర్ లోని నివాసంలో ఆరుగురు సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.

నందినగర్ నివాసంలో విచారణ
బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ చేసే అవకాశం ఉంది.


SIT at KCR House: కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన, ప్రభుత్వంపై విమర్శలు

నోటీసులపై అభ్యంతరం.. విచారణకు సహకారం
సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వయస్సు దృష్ట్యా తాను నివాసం ఉంటున్న ఎర్రవల్లిలోనే విచారించాలని కోరారు. అయితే, అధికారులు నిరాకరించడంతో నందినగర్ నివాసంలో విచారణకు ఆయన అంగీకరించారు. కేసీఆర్ ఏసీపీకి రాసిన లేఖలో "నోటీసులు జారీ చేసిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధం, కానీ బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తాను" అని మాజీ సీఎం పేర్కొన్నారు. ఈ సమయంలో కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు నందినగర్ నివాసంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే చివరి నిమిషంలో కేటీఆర్ ఒక్కడిని మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చారు. సొంత కుటుంబసభ్యుడు కావడంతో కేటీఆర్ ఇంట్లోనే ఉండగా.. పర్మిషన్ ఇవ్వకపోవడంతో హరీష్ బటయకు వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
మరోవైపు, కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్‌లో విచారణ జరుగుతున్న నందినగర్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget