అన్వేషించండి

KCR letter to SIT: గోడకు నోటీసులు అంటించడం చట్టవిరద్ధం - సిట్‌కు కేసీఆర్ 6 పేజీల ఘాటు లేఖ !

Phone Tapping Case: విచారణకు అందుబాటులో ఉంటానని చెబుతూనే కీసీఆర్ సిట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆరు పేజీల లేఖను పంపారు.

KCR letter to SIT:   ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీసుల ఈ చర్య కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు.
 
లేఖలో కేసీఆర్ ప్రధానంగా న్యాయపరమైన అంశాలను ప్రస్తావించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసం వద్దే విచారించాలని సీఆర్‌పీసీ   సెక్షన్ 160 స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే,  సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఏపీ హైకోర్టులోని  వీడీ మూర్తి  కేసు తీర్పును కూడా ఉటంకిస్తూ, నివాసం ఉంటున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చేసిన చట్టాన్ని పోలీసులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు.   

 
పోలీసులు తన ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామాను సాకుగా చూపడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. అఫిడవిట్ లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని, ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతానికే నోటీసులు పంపాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. హరీష్ రావు వంటి ఇతర నేతల విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో తనకు పంపే ఏ నోటీసులైనా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని, చట్టవిరుద్ధంగా ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కూడా ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.       
 
అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చినప్పటికీ, ఒక బాధ్యతాయుత పౌరుడిగా , ప్రతిపక్ష నేతగా తాను విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు తాను సిద్ధమని, నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే, ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, చట్టపరంగా అన్ని అంశాలను ఎదుర్కొంటానని ఆయన తన లేఖ ద్వారా పోలీసులకు, ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపారు. 

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget