అన్వేషించండి

KCR: సిట్ ఎదుట హాజరుకే కేసీఆర్ మొగ్గు - భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. విచారణకు భయపడుతున్నారన్న విమర్శలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

KCR to appear before SIT :  తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్   విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ కీలక నేతలు , న్యాయ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టి సమాధానం చెప్పాలని గులాబీ దళం భావిస్తోంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణ జరగనుండటంతో, కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ నినాదం-  రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు 

కేసీఆర్ విచారణను కేవలం ఒక దర్యాప్తుగా కాకుండా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరిగిన దాడిగానే బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను కావాలనే అవమానిస్తున్నారని మండిపడుతున్న పార్టీ శ్రేణులు, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట కావాలనే కుట్రపూరితంగా ఈ విచారణలు సాగిస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ  రాజకీయ కక్షసాధింపు  అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.  

కేటీఆర్, హరీష్ రావు వాంగ్మూలాల ఆధారంగా విచారణ 

సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు,  సంతోష్ రావులను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు, వారి నుంచి సేకరించిన వాంగ్మూలాలు, గతంలో  ఐదుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కేసీఆర్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరెవరికి చేరింది  అనే అంశాలపై అధికారుల ప్రశ్నలు ప్రధానంగా ఉండనున్నాయి. 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి ఆయన నివాసంలోనే విచారించేందుకు అధికారులు 160 CrPC కింద నోటీసులు జారీ చేశారు.   

పోలీసుల భారీ బందోబస్తు 

ఈ హై-ప్రొఫైల్ విచారణ , బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునివ్వడంతో  నందినగర్ చుట్టూ భద్రతా వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేయనున్నారు.   బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, శాంతిభద్రతల దృష్ట్యా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నందినగర్ వెళ్లే దారులన్నీ పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి.  ఆదివారం జరగబోయే ఈ విచారణ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.                          


 

టాప్ హెడ్ లైన్స్

TRS Chief Kavitha: పరీక్ష పాసై డీజీపీ అయ్యారా? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చారా?- టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు
పరీక్ష పాసై డీజీపీ అయ్యారా? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చారా?- టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు
KCR BRSLP Meeting: త్వరలోనే కేసీఆర్ పాదయాత్ర.. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తా! బీఆర్ఎస్‌ అధినేత
త్వరలోనే కేసీఆర్ పాదయాత్ర.. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తా! బీఆర్ఎస్‌ అధినేత
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం - ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదంటూ...
మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం - ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదంటూ...

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Bigg Boss 10: 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
Embed widget