News
News
X

Hyderabad: హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి.. హాట్ టాపిక్‌గా ఆ ట్వీట్..!

జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 3 రోజుల సమన్వయ్‌ బైఠక్‌ సమావేశాలను ఏర్పాటు చేసింది.

FOLLOW US: 

హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ అంశంపై కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ నాయకులు కొందరు హైదరాబాద్ పేరు మార్చుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు మార్చుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామని చెప్పారు. తమ రాష్ట్రంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్‌ రాజ్‌గా మార్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే తరహాలో హైదరాబాద్‌ పేరును కూడా భాగ్య నగర్‌గా మారుస్తామని అన్నారు. ఈ విషయం అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. ఆ సంగతి ఆ ఎన్నికలతోనే ముగిసిపోయినా.. తాజాగా అది మరోసారి తెరపైకి వచ్చింది.

ఆర్ఎస్ఎస్ ట్వీట్‌తో దుమారం
2022 ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 3 రోజుల సమన్వయ్‌ బైఠక్‌ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ దుమారం రేపుతుంది. అందులో హైదరాబాద్‌కు బదులు ఏకంగా భాగ్యనగరం అనే పేరును వాడారు.

‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగనుంది’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకార్ ట్వీట్‌ చేశారు.

ఇలా హైదరాబాద్‌కు బదులుగా భాగ్యనగర్‌ అని పేర్కొనడంపై దుమారం రేగుతున్నది. గత అసెంబ్లీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  ఆ సమయంలో ఈ విషయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

News Reels

Also Read: Hyderabad RRR Update: రెండు భాగాలుగా RRR.. నార్త్ సైడ్‌కు గ్రీన్ సిగ్నల్.. సౌత్ సైడ్‌ మరింత లేట్, కారణం ఏంటంటే..

Also Read: Harish Rao: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..

Also Read: Consumer Court: సరకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇవ్వాల్సిందే.. ఆ డీమార్ట్ లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు వెళ్లండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 02:53 PM (IST) Tags: RSS rashtriya swayamsevak sangh Hyderabad Name Change Bhagyanagar RSS Samanvay Baithak Hyderabad RSS Meet

సంబంధిత కథనాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు కథ ఇప్పుడే మొదలైందా? పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు కథ ఇప్పుడే మొదలైందా? పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

TSRTC Shuttle Services : ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి షటిల్ సర్వీస్ బస్ లు!

TSRTC Shuttle Services : ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి షటిల్ సర్వీస్ బస్ లు!

Etela Rajender : అటుకులు బుక్కి నడిపిన పార్టీకి 8 ఏళ్లలో రూ.870 కోట్లు ఎలా వచ్చాయ్?- ఈటల రాజేందర్

Etela Rajender : అటుకులు బుక్కి నడిపిన పార్టీకి 8 ఏళ్లలో రూ.870 కోట్లు ఎలా వచ్చాయ్?- ఈటల రాజేందర్

YS Sharmila: కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు? విడాకులు అడుగుతున్నామా? షర్మిల వ్యాఖ్యలు

YS Sharmila: కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు? విడాకులు అడుగుతున్నామా? షర్మిల వ్యాఖ్యలు

Vande Bharat Express: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌ న్యూస్- 10 గంటల్లోనే సికింద్రాబాద్ చేరుకోవచ్చు!

Vande Bharat Express: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌ న్యూస్- 10 గంటల్లోనే సికింద్రాబాద్ చేరుకోవచ్చు!

టాప్ స్టోరీస్

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా