News
News
X

Harish Rao: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాప‌ణ చెప్పాల‌ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తమ మంత్రుల‌ను అవ‌మానించే హ‌క్కు మీకు ఎక్కడిద‌ని ప్రశ్నించారు.

FOLLOW US: 

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై నేడు (డిసెంబరు 22) మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యల‌పై మంత్రి హ‌రీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొంటారా లేదా అని సూటిగా అడుగుతుంటే.. డొంకతిరుగుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తమ మంత్రుల‌ను అవ‌మానించే హ‌క్కు మీకు ఎక్కడిద‌ని ప్రశ్నించారు. మంత్రుల‌ను క‌ల‌వ‌కుండా బీజేపీ నేత‌ల‌తో మాట్లాడ‌తారా అని నిలదీశారు. పీయూష్ వ్యాఖ్యలు రైతుల‌ను అవ‌మాన ప‌ర్చడ‌మేన‌ని అన్నారు. 

70 ల‌క్షల మంది రైతుల త‌ర‌పున మంత్రులు ఢిల్లీ వ‌చ్చార‌ని వారిని.. వారిని ఉద్దేశిస్తూ పని లేక వచ్చారని ఎద్దేవా చేస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు. త‌న వ్యాఖ్యల‌ను పీయూష్ గోయ‌ల్ వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. ఆయ‌న వ్యాఖ్యల‌పై బీజేపీ నేత‌లు ఏం చెప్తార‌ని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ రైతుల తరపున ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనాలని అడగడం తప్పా? మమ్మల్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడతారా? ధాన్యం కొనాలనే ఉద్దేశం ఉంటే.. కొంటామని చెప్పాలి. చేతకాకపోతే కుదరదని చెప్పాలి. ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. అంతేకానీ, మంత్రులను కించపరుస్తూ మాట్లాడడం ఏంటి?’’ అని హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఇంత దుర్మార్గమా..
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే హక్కు పీయూష్ గోయల్‌కు ఎక్కడిదని హరీశ్ రావు నిలదీశారు. ‘మీకు రాజకీయాలు ముఖ్యం కావొచ్చు.. కానీ మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమ’ని హరీష్ రావు తేల్చి చెప్పారు. తమ మంత్రులను కలవడానికి సమయం ఉండదు, కానీ బీజేపీ నేతలకు మాత్రం వెంటనే సమయం ఇస్తారా? అని నిలదీశారు. రాష్ట్రం నుండి అధికారుల బృందం వస్తే కలవకుండా రాజకీయం చేసింది మీరు కాదా అని పీయూష్ గోయల్ ను నిలదీశారు హరీష్ రావు.ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారో అర్ధం చేసుకోవాలన్నారు.

Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్ 

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..

Also Read: Consumer Court: సరకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇవ్వాల్సిందే.. ఆ డీమార్ట్ లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు వెళ్లండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 12:32 PM (IST) Tags: Minister Harish Rao Paddy Procurement Union minister piyush goyal Telangana ministers in Delhi

సంబంధిత కథనాలు

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన

Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన

Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ

Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ

Hyderabad Metro: నేడు ఈ టైంలో నిలిచిపోనున్న మెట్రో రైళ్లు, ఎక్కడివక్కడే - ఆ తర్వాతే మళ్లీ స్టార్ట్

Hyderabad Metro: నేడు ఈ టైంలో నిలిచిపోనున్న మెట్రో రైళ్లు, ఎక్కడివక్కడే - ఆ తర్వాతే మళ్లీ స్టార్ట్

Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై

Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై

టాప్ స్టోరీస్

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

Tadipatri JC : తాడిపత్రిలో భయానక పరిస్థితులు - ఎస్పీ ఏం చేస్తున్నారని జేసీ ప్రశ్న !

Tadipatri JC :  తాడిపత్రిలో భయానక పరిస్థితులు - ఎస్పీ ఏం చేస్తున్నారని జేసీ ప్రశ్న !

Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

Munugodu BJP :  మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !