అన్వేషించండి

Hyderabad Real Estate Scam: 270 కోట్ల మోసం ఆరోపణలు- హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థపై చీటింగ్ కేసు నమోదు

Double Registration Scam | సొంతింటి కల త్వరలో సాకారం చేస్తామని నమ్మించి కొనుగోలుదారుల నుంచి 270 కోట్లు కొల్లగొట్టిన వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Real Estate Scam In Hyderabad | హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ లో భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని నమ్మించి సుమారు 500 మంది బాధితుల నుండి దాదాపు ₹270 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆపై మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. మూసాపేటకు చెందిన సుజాత అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గత పదేళ్లుగా ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్న ఈ సంస్థ, 2018లో వెంచర్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టలేదు. ఫిర్యాదుదారు సుజాత తన ఫ్లాట్ కోసం ₹80 లక్షలు చెల్లించగా, సదరు సంస్థ అదే ఫ్లాట్‌ను బ్యాంకులో ₹1.27 కోట్ల రుణానికి గిరవు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాజెక్టులో కేవలం రెండు టవర్లు మాత్రమే కొంతమేర పూర్తి కాగా, మిగిలిన టవర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అసలు కొన్నింటి నిర్మాణం ప్రారంభమే కాలేదని బాధితులు వాపోతున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని EOW అధికారులు తెలిపారు.Hyderabad Real Estate Scam: 270 కోట్ల మోసం ఆరోపణలు- హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థపై చీటింగ్ కేసు నమోదు

ఒకే ఫ్లాట్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి అమ్మడం, గడువు ముగిసినా హ్యాండోవర్ చేయకపోవడం వంటి అక్రమాలపై ఇప్పటికే వందకు పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీనిపై స్పందించిన పోలీసులు సంస్థ యజమాని అజయ్‌తో పాటు మరికొందరు డైరెక్టర్లపై BNS సెక్షన్లు, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్ 318(4) మోసం (Cheating), BNS సెక్షన్ 316(2) నేరపూరిత కుట్ర, BNS సెక్షన్ 316(5) నమ్మక ద్రోహం, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 

ప్రాజెక్ట్ వివరాలు
ఈ వెంచర్ 2018లో ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కేవలం A, B టవర్స్‌లో నిర్మాణం కొంతమేర పూర్తి చేశారు. C, D టవర్ల బేస్‌మెంట్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టులో E, F టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. RERA నమోదు గడువు ఇప్పటికే రెండుసార్లు పొడిగించగా, ఈ ఏడాది జూన్‌లో ముగియనుందని కొనుగోలుదారుల ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 2024, డిసెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చలేదని బాధితులు తెలిపారు. ఒకే ఫ్లాట్‌ను ఒకరికి మించి అమ్మినట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget