అన్వేషించండి

Pawan Kalyan: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..

సింగరేణి కాలనీకి కారులో పవన్ కల్యాణ్ చేరుకోగానే, ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒకర్నొకరు తోసుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై చనిపోయిన ఆరేళ్ల పాప కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్‌కు ఆటంకం ఏర్పడింది. బాధిత కుటుంబం వద్దకు పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ఆ కాలనీకి పోటెత్తారు. ఆ తర్వాత సింగరేణి కాలనీకి కారులో పవన్ కల్యాణ్ చేరుకోగానే, ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒకర్నొకరు తోసుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో పవన్ కల్యాణ్ కనీసం కారు కూడా దిగే పరిస్థితి లేకుండా పోయింది. అభిమానుల తీరుతో పవన్​కల్యాణ్ ఒకింత అసహనానికి గురైనట్టుగా తెలుస్తోంది.Pawan Kalyan: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..

చివరికి ఎట్టకేలకు పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాన్ని కలిశారు. చిన్నారిపై అఘాయిత్యం జరగడం తనను కలచి వేసిందని ఆవేదన చెందారు. బాధిత కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.Pawan Kalyan: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..

సైదాబాద్‌లోని ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు తన గదిలోనే అత్యాచారం చేసి పరుపులో చుట్టేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విపక్ష నేతలు పలువురు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. త్వరగా నిందితుణ్ని పట్టుకుంటామని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు, నిందితుడు రాజు కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా నిందితుడి ఆచూకీ మాత్రం లభించడం లేదు. దీంతో పోలీసులు నిందితుడి కోసం భారీ నజరానా ప్రకటించారు. అతణ్ని పట్టిస్తే ఏకంగా రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. నిందితుడ్ని పట్టుకోవడం ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి.
Pawan Kalyan: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..

బాధిత కుటుంబానికి రాజకీయ నేతల మద్దతు పెరుగుతుండడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. విపక్ష నేతలంతా రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు, వైఎస్ షర్మిల సైతం బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ఆమె ఏకంగా సదరు కాలనీలో దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ స్పందించేవరకూ తాను దీక్ష విరమించబోనని ఆమె తేల్చి చెప్పారు.

Also Read: Sonu Sood: సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..

Also Read: Sharmila : రూ. 10 కోట్ల పరిహారం ఇవ్వాలి.. సీఎం స్పందించాలి ! చిన్నారికి న్యాయం చేయాలని సింగరేణి కాలనీలో షర్మిల దీక్ష !

Also Read: Revanth Reddy: కేసీఆర్ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశా.. కానీ నో రెస్పాన్స్..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget