By: ABP Desam | Updated at : 15 Sep 2021 02:35 PM (IST)
Edited By: Sai Anand Madasu
టీఆర్ఎస్ గవర్నమెంట్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నర ఏళ్లు అవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతి మీద ఆధారాలతో సహా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా వస్తున్నారని.. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతి పై ఆధారాలు అందజేస్తామని చెప్పారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ ఇలా అనేక అవకతవకలపై ఫిర్యాదు చేస్తామని రేవంత్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధారాలు లేవంటున్నారని.. తమకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తే అందజేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
'తెలంగాణలో వ్యసనపరులకు స్వర్గధామంగా మారింది. విపరీతంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక దాడులకు.. మద్యం మత్తులో చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లో నేరాల లిస్ట్ లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. మద్యం , గంజాయి మత్తులో తెలంగాణ యువత చిక్కుకుంటోంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ సింగరేణి ఘటనపై .. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడని చెప్పారు. 5 రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. సీఎం కేసీఆర్ ను అడుగుతున్నాను. ఆరేళ్ల పసిబాలలను హత్యాచారం చేస విష సంస్కృతిని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు?
- రేవంత్ రెడ్డి, ఎంపీ
సినీనటులు డ్రగ్స్ వాడుతున్నారని గతంలో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి.. విచారణ అధికారి అకున్ సభర్వాల్ ను పక్కకు తప్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ కేసులో కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేసినట్లు గుర్తు చేశారు. ఈడీ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు పేర్కొందని చెప్పారు. డ్రగ్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
Also Read: Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?
TS Inter Results 2022 Live Updates: నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి
Juvenile Escaped: జువైనల్ హోం నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరార్, పోలీసులకు టెన్షన్ టెన్షన్
KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్కు వెళ్తారా?
Hyderabad Traffic News: హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!
Petrol-Diesel Price, 28 June: శుభవార్త! నేడు స్వల్పంగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ నగరంలో ఇలా
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్లో ప్రయోగం సక్సెస్
Coronavirus Symptoms: ఈ రెండు ప్రాంతాల్లో వచ్చే నొప్పి కరోనా సోకిందని చెప్పే ముందస్తు సంకేతం కావచ్చు, తేలికగా తీసుకోవద్దు