అన్వేషించండి

కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి చేతిలో పురుగుల మందు.. ఉరి తాడు... అసలు సంగతి తెలిసి అవాక్కైన ప్రజలు, పోలీసులు

ఎలాగైనా పని చేసుకోవడానికి బరితెగిస్తున్నారు కొందరు వ్యక్తులు. దీని వల్ల నిజంగా సమస్య ఉన్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఓ వ్యక్తి ఉరితాడు, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు.  తన భూమిని రిజిస్టర్ చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని గట్టిగా అరుస్తున్నాడు. 

ఈ సీన్ చూసిన వాళ్లంతా అయ్యో పాపం అనుకున్నారు. అధికారులకు ఎంత బలుపు.. బాధితుడి గోడు పట్టించుకోరేంటని చీదరించుకున్నారు. అధికారులు పట్టించుకోలేదు కానీ పోలీసులు వచ్చి అతడు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా పట్టుకున్నారు. 

అధికారులకు వద్దకు తీసుకెళ్లి అతని సమస్యేంటి.. ఎందుకు పరిష్కరించడం లేదని ఆరా తీశారు. అప్పుడు వాళ్లు చెప్పిన అసలు సంగతి విని షాక్ తిన్నారు. ఇలా కూడా బరితెగిస్తున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. 

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి బెదిరంపుల కేసులు ఎక్కువైపోతున్నాయట. రియల్‌ఎస్టేట్ పేరుతో బోర్డులు పెట్టేసుకొని కబ్జా భూములు, అమ్మిన భూములనే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. 

ఇప్పుడు ఇలాంటి అక్రమాలు చేసేందుకు అవకాశం లేదని.. అంతా ఆన్‌లైన్ అయ్యాక చీటింగ్‌కు వీలుకాదని చెప్పినా వినడం లేదట. అలా చేస్తే తాము ఇరుక్కుంటామని అధికారులు చెబుతున్నా సదరు వ్యక్తులు పట్టించుకోవడం లేదట. 

ఈ మధ్య కాలంలో ఇలాంటి ముఠాలు ఎక్కువైపోయాయని అధికారులు వాపోతున్నారు. పని చేయమని ఒత్తిడి చేస్తున్నారని కాదు కూడదని చెబితే ఆత్మహత్య చేసుకుంటామని కార్యాలయం వద్దే బెదిరంపులకు దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయంటున్నారు. 

ఇలాంటి వ్యక్తులు కార్యాలయాల వద్ద హల్ చల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. వీటి అసలు నిజాలు తెలుసుకోకుండా చాలా మంది షేర్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని... తమపై నిందలు వేస్తున్నారని వాపోతున్నారు. 

వికారబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద కూడా హడావుడి చేసిన వ్యక్తి కూడా వక్ఫ్‌బోర్డు భూములు కాజేసేందుకు యత్నించాడని... రిజిస్ట్రేషన్ చేయించుకోవాని యత్నించాడని చెప్పారు అధికారులు. కాదన్నందుకు ఇలా కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశాడంటూ పోలీసులకు చెప్పారు. 

అసలు సంగతి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. నిజం తెలుసుకున్న అక్కడి ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటున్నారు. నిజంగా సమస్యతో వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Also Read:  గవర్నర్‌పై దీదీ ఫైర్.. ఏకంగా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం!

Also Read: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు... భక్తుల సౌకర్యార్థం 3,845 బస్సులు... జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష 

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget