Mamata on Dhankhar: గవర్నర్‌పై దీదీ ఫైర్.. ఏకంగా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం!
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారు.
బంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తాజాగా వివాదం మరింత ముదిరింది. ఎంతలా అంటే ఏకంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ట్విట్టర్ ఖాతాను సీఎం దీదీ బ్లాక్ చేసేశారు.
ఎందుకంటే..?
గవర్నర్ జగదీప్ ధన్‌కర్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ బెదిరిస్తున్నారని కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు.
గవర్నర్ ధన్‌కర్ గురించి నేను ప్రధానికి ఇప్పటివరకు చాలా లేఖలు రాశాను. ఆయన మా మాట వినడం లేదని.. అందరినీ బెదిరిస్తున్నారని చెప్పాను. స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఈ విషయాన్ని చెప్పాను.
దాదాపు ఏడాది కాలంగా ఎంతో సహనంతో ఆయన్ను భరిస్తున్నాం. ఆయన చాలా ఫైళ్లు ఇంకా క్లియర్ చేయలేదు. మేం పంపిన ప్రతి ఫైల్‌ను పెండింగ్‌లో పెడుతున్నారు. అసలు విధానపరమైన నిర్ణయాల గురించి గవర్నర్ ఎలా మాట్లాడతారు?
పెగాసస్ అక్కడి నుంచే..
అంతేకాకుండా తమ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారుల ఫోన్లను గవర్నర్ ట్యాప్ చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆయన్ను ఇప్పటివరకు మోదీ ఎందుకు బాధ్యతల నుంచి తొలగించలేదని ప్రశ్నించారు. పెగాసస్.. గవర్నర్ ఇంటి నుంచే ఆపరేట్ అవుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
గవర్నర్ ట్వీట్..
మమతా బెనర్జీ మీడియా సమావేశం పూర్తయిన కాసేపటికే గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఓ ట్వీట్ చేశారు.
Guv WB : Mandated under Article 159 of the Constitution to ensure none in the state “blocks” Constitutional Norms and Rules of Law and those in authority “bear true faith and allegiance to the Constitution of India” pic.twitter.com/gGDf3doAyJ
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) January 31, 2022
ఆ ట్వీట్‌లో గవర్నర్ హక్కులు, బాధ్యతల గురించి ఉంది.
Also Read: Watch Video: 'గూండాలు' అన్న ప్రధాన మంత్రి.. దండాలు పెట్టిన కేంద్ర మంత్రి!