అన్వేషించండి

Nellore News: చాకెట్లలో పురుగులు... వినియోగదారుడి ఫిర్యాదుతో ఊరిలో షాపులన్నీ క్లోజ్...

కుమార్తె పుట్టిన రోజుకు కొన్న చాకెట్ల బాక్స్ నిండా పురుగులు ఉన్నాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించాడో వ్యక్తి. దీంతో ఆ ఊరిలో అన్ని షాపులు బంద్ అయ్యాయి.

నెల్లూరు జిల్లా కోవూరుకి చెందిన రఘురాం ఇటీవల తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ షాపులో చాక్లెట్ బాక్స్ కొన్నాడు. ఆ చాకెట్లను విప్పి చూస్తే అన్నీ పురుగులే ఉన్నాయి. అదేంటని షాపు యజమానిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. దీంతో ఆ వ్యక్తి తన పిల్లల్ని తీసుకుని నేరుగా తహశీల్దార్ ని కలసి ఫిర్యాదు చేశాడు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే తహశీల్దార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితుడు రఘురాం పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో ఇవాళ నెల్లూరు జిల్లా కోవూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. చాక్లెట్లు అమ్మిన షాపుతోపాటు, మిగతా షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారని తెలిసే సరికి ఊరు ఊరంతా షాపులు మూతబడ్డాయి. కోవూరులో అన్ని షాపులు షట్టర్లు దించేసి వ్యాపారులు ఎక్కడివారక్కడ గప్ చుప్ అయిపోయారు. ఒక్కసారిగా కోవూరులో షాపులన్నీ మూతబడటంతో స్థానికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్ లో మరో ఘటన 

హైదరాబాద్ కూకట్ పల్లి విజేత సూపర్ మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. 3 నెలల క్రితం డేట్ అయిపోయిన లస్సీని విజేత సూపర్ మార్కెట్ లో విక్రయించారు. డేట్ చూసుకోక లాస్సి తాగిన ఓంకేశ్ అనే వినియోగదారుడు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఓంకేశ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూపర్ మార్కెట్లో దాడులు చేశారు. మార్కెట్లో బొద్దింకలు, ఎలుకలు, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు. కూకట్ పల్లి పోలీసులకు బాధితుడి ఓంకేశ్ ఫిర్యాదు చేశారు. 

Nellore News: చాకెట్లలో పురుగులు... వినియోగదారుడి ఫిర్యాదుతో ఊరిలో షాపులన్నీ క్లోజ్...

Also Read: మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget