అన్వేషించండి

Hyderabad: ప్రమాదకర స్థితిలో మూసీ ప్రవాహం, ఆ బ్రిడ్జి బంద్! ఈ ప్రాంతాల్లో బాగా దుర్వాసన

Moosarambagh: వంతెనపై మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని కాలనీలను ఎలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ వంతనపై రాకపోకలను నిలిపివేశారు.

 హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో నిండిపోయాయి. చార్మినార్‌, బహదూర్‌పుర, మలక్‌పేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం వ్యాపించింది. బురద బాగా పేరుకుపోతోంది. ఎంజీబీఎస్‌, హైకోర్టు, ముసారంబాగ్‌ తదితర ప్రాంతాల్లో మూసీ నది ప్రవాహం ప్రమాదకర స్థితిలో ఉంది. మూసారంబాగ్‌ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్ద ఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు మునిగిపోయాయి. 

మంగళవారం రాత్రి కూడా NDRF యంత్రాంగం ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఒక ఫ్యామిలీని రక్షించింది. ఇందులో ఒక చంటి పిల్లవాడుతో సహా 5 గురు ఉన్నారు. ఉస్మాన్ సాగర్ 12 గేట్లను అధికారులు తెరిచారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో అధికారులు, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు మంగళవారం రాత్రి లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.బహదూర్ పురా, కిషన్ బాగ్ ప్రాంతాల్లో మూసీ నది సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. 

Also Read: Musi River Flood: హెచ్చరిక! ఉగ్ర రూపంతో మూసీ నది, హైఅలర్ట్ జారీ - ఈ బ్రిడ్జిలు బంద్! వేరే మార్గాలు చూసుకోవాల్సిందే

మరోవైపు మూసారాంబాగ్ వంతెనపై మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని కాలనీలను ఎలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ వంతనపై రాకపోకలను నిలిపివేశారు. అంబర్‌పేట, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గోల్నాక లేదా చాదర్‌ఘాట్‌ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలను కోరారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కు బాగా అంతరాయం ఏర్పడుతోంది. మూసీ నదీ ప్రవాహం వల్ల ఇంకా కొన్ని కాలనీలు నీటిలో నే ఉన్నాయి. అధికారులు నీటి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మూసీ వెంబడి లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
Hyderabad: ప్రమాదకర స్థితిలో మూసీ ప్రవాహం, ఆ బ్రిడ్జి బంద్! ఈ ప్రాంతాల్లో బాగా దుర్వాసన

మరోవైపు, వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ప్రాంతం కూడా వరదలో చిక్కుకుంది. రికార్డు స్థాయిలో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లకు వరద పోటెత్తుతుండడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి 13 వేల క్యూసెక్కులను మూసీ నదిలోకి వదిలారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే, అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూకట్‌పల్లి, బుల్కాపూర్‌ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Musi River Flood: హెచ్చరిక! ఉగ్ర రూపంతో మూసీ నది, హైఅలర్ట్ జారీ - ఈ బ్రిడ్జిలు బంద్! వేరే మార్గాలు చూసుకోవాల్సిందే

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగుకు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలో మల్కాపూర్‌, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది.
Hyderabad: ప్రమాదకర స్థితిలో మూసీ ప్రవాహం, ఆ బ్రిడ్జి బంద్! ఈ ప్రాంతాల్లో బాగా దుర్వాసన

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget